విజయవంతంగా జరిగిన అమెరికా తెలుగు సంఘం (ఆటా) బోర్డు మీటింగ్

అమెరికా తెలుగు సంఘం (ఆటా) శనివారం మే 8, 2021 న కాస్మోపాలిటన్, లాస్ వెగాస్, అమెరికాలో జరిగిన బోర్డు సమావేశంలో అధ్యక్షులు భువనేశ్ బూజాల అధ్యక్షత వహించారు. ఉత్తరాధ్యక్షులు మధు బొమ్మినేని, కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ బోయపల్లి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ ఆల, సంయుక్త కోశాధికారి విజయ్ కుందూర్, పూరవాధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కార్యనిర్వాహక సంచాలకులు రఘువీర్ రెడ్డి, పాలకమండలి బృంద సభ్యుల ఆధ్వర్యంలో ఎనిమిది గంటలపాటు నిర్విరామంగా సమావేశాన్ని జరిపారు. వివిధ నగరాలలో సేవలు అందిస్తున్న రీజినల్ కో ఆర్డినేటర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్, పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరు అయ్యారు. ముందుగా కార్యక్రమానికి ప్రార్థనా గీతంతో ప్రారంభించి, కోవిడ్ మూలంగా మృతిచెందిన వారి కోసం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు.
ఆటా సంస్థ 2021 లో చేపట్టిన కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్ వెబినార్, టాక్స్ వెబినార్, యూఎస్‍ఏ కు ప్రయాణ నిషేధంపై ఇమ్మిగ్రేషేన్ వెబినార్, డ్రోన్ ని సమీకరించటం ఎలా అనే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం (స్టెమ్) రంగానికి సంబంధించిన వెబినార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమము, అమెరికా భారతి పత్రిక యొక్క మొదటి త్రైమాసిక విడుదల, ఉగాది సాహిత్య సదస్సు, వివిధ నగర్లో జరిపిన కమ్యూనిటీ సర్వీస్/ ఫుడ్ డ్రైవ్ ఈవెంట్స్, రక్తదాన శిబిరాలు, వాక్సిన్ డ్రైవ్స్ గురించి క్లుప్తంగా వివరించారు. అలాగే కొనసాగుతున్నటువంటి యోగ క్లాసెస్, ఎల్ ఏ ఫిట్నెస్ జిం భాగస్వామ్య కార్యక్రమాల గురించి వివరించారు. ప్రస్తుతం కొవిడ్‍తో ఇబ్బంది పడుతున్న రెండు రాష్ట్రాలకి సహాయంగా ఆటా సంస్థ 100 ఆక్సిజన్ కాన్సన్రేట్లర్ల కోసం విరాళాలని సేకరించి అందించింది. ఈ కార్యక్రమ దాతలకి ఆటా నాయకత్వం హృదయపూర్వక ధన్యవాదాలని తెలియచేసింది. అమెరికాలో పుట్టిపెరుగుతున్న యువతీ యువకులకు సంబందించిన డాలర్స్ ఫర్ స్కాలర్స్ అనే స్కాలర్షిప్ ఫండ్ మరియు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ‘మై స్కూల్- మై రెస్పాన్సిబిలిటీ’ అనే కార్యక్రమానికి నాంది పలుకుతూ, విరాళాలు ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మే నెలలో ప్రారంభిస్తున్న భగవద్గీత ఆధ్యాత్మిక తరగతులు అలాగే క్లౌడ్ టెక్నాలజీ ట్రైనింగ్స్ గురించి వివరించారు.
ఆటాలో అత్యధికంగా కొత్త సభ్యులని చేర్చిన వారికి రీజినల్ కో ఆర్డినేటర్ అఫ్ ది మంత్ గా గుర్తింపుని ఇచ్చి సంస్థ అభినందించింది. అమెరికా మరియు మన తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితికి సహాయంగా మరిన్ని సేవా కార్యక్రమాలని చేయటానికి సంస్థ సంసిద్ధమవుతున్నది.
అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డి.సీలో వున్న వాల్టర్.ఈ.వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో 2022 జూలై 1 నుండి జూలై 3 వరకు జరిగే 17వ ఆటా కాన్పరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ కు కాన్ఫరెన్స్ నాయకత్వ అడ్వైజరీ చైర్ గా, సాయి సుధిని కో-కన్వీనర్‍గా, రవి చల్లా కో-ఆర్డినేటర్ గా సంస్థ నియమించింది.
అధ్యక్షులు భువనేశ్ బూజాల ఈ సంవత్సరంలో విజయవంతంగా ఆటా కార్యక్రమాలన్ని జరిపిస్తూవున్న రీజినల్ కో ఆర్డినేటర్స్ ని, అలాగే స్టాండింగ్ కమిటీస్ అందరిని అభినందించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకి ఎమర్జెన్సీ పరిస్థితులలో సేవలను అందిస్తున్న ఆటా సేవా-టీం కార్యవర్గాన్ని కొనియాడారు. ఆటా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.