ఆటా కాన్ఫరెన్స్, ఆటా వేడుకలకు రండి.. డిట్రాయిట్ ఆటా బోర్డు సమావేశంలో నాయకుల పిలుపు
వచ్చే ఏడాది వాషింగ్టన్ డీసి వేదికగా జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న ఆటా 17వ సమావేశాలు, మెంబర్షిప్ వంటి విషయాలపై డిట్రాయిట్లో జరిగిన ఆటా బోర్డ్ సమావేశంలో చర్చించారు. ఆటా బోర్టు సమావేశం ప్రారంభించడానికి ముందు సెప్టెంబర్ 11 బాధితులకు నివాళి అర్పించారు. ఆటా ఆర్థిక స్వయం సమృద్ధికి సంబంధించిన విశేషాలను ఆటా అధ్యక్షుడు భువనేశ్ బూజాల, కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డలు వివరించారు. ఆటా కాన్ఫరెన్స్‌కు 10వేల మందికిపైగా హాజరవుతారని భావిస్తున్నట్లు భువనేష్ బూజాల తెలిపారు.
ఈ సమావేశంలో ఫైనాన్షియల్ రిపోర్టును ట్రెజరర్ బోయపల్లి సాయినాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గడిచిన కొద్ది కాలంలోనే వెయ్యి మందికి పైగా కొత్తగా ఆటాలో సభ్యత్వం తీసుకున్నట్టు మెంబర్ కమిటీ సభ్యుడు నర్సిరెడ్డి తెలిపారు. పిన్నపురెడ్డి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ నివేదికను తెలియజేశారు. ఆటా మాట్రిమోనియల్ కమిటీ చైర్ అరుంధతి కోడూరి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి ఆల ఈ సందర్భంగా ఆటా కొత్త మాట్రిమోనియల్ సైట్‌ను ప్రదర్శించారు. రీజినల్ కో ఆర్డినేటర్స్, స్టాండిరగ్ కమిటీ ప్రతినిధులు కూడా తమ తమ నివేదికను బోర్డ్‌కు సమర్పించారు. ఆటా డీసి కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు కాన్ఫరెన్స్‌కు చేస్తున్న కార్యక్రమాలను, ఇతర విషయాలను తెలియజేశారు. ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ ఆటా వేడుకల చైర్ మధు బొమ్మినేని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ఆటా వేడుకల షెడ్యూల్‌ను, కార్యక్రమాల ప్రణాళికలను వివరించారు. ఈ వేడుకల్లో ఆటా సభ్యులంతా పాల్గొనాలని, ఆటా ప్రాజెక్టులకు చేయూతనివ్వాలని కోరారు. ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ, ప్రెసిడెంట్ భువనేష్ బూజాల, ఆయన టీమ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఫండ్‌రైజింగ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. సెయింట్లూసీ క్రొయేషిన్ కాథలిక్ చర్చ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మెట్రో డిట్రాయిట్ ఏరియాలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హెచ్‌టిసి గ్లోబల్ సర్వీసెస్ ఫౌండర్, సిఇఓ మాధవ్ రెడ్డి, స్టేట్ సెనేటర్ జిమ్ రూనెస్టాడ్, స్టేట్ రిప్రజెంటేటివ్ పద్మ కుప్ప, పియట్ క్లిస్టర్ ఆటోమోటీవ్ సిఐఓ మమత చామర్తి, ఎంఐ స్టేట్ సర్టిఫికెట్ సభ్యుడు డా. అశోక్ కొండూర్ తదితరులను ఈ సందర్భంగా సన్మానించారు. ఆటా కో కన్వీనర్ కిరణ్ పాశం 1.25 మిలియన్ డాలర్స్ సేకరించినట్లు చెప్పారు. హర్ట్పుల్నెస్ ప్రోగ్రామ్ గైడ్ కమలేశ్ డీ పటేల్ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.













