ఆటా బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలోని బోస్టన్ బ్యాడ్మింటన్ క్లబ్లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. మసాచుసెట్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మద్దతుతో న్యూ ఇంగ్లాండ్ టీమ్ ఈ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఈ ఓపెన్ టోర్నమెంట్లో బోస్టన్ మరియు న్యూ ఇంగ్లండ్ ప్రాంతాల నుండి దాదాపు 200 మంది పురుషులు, మహిళలు, బాలికలు మరియు బాలురు (కొంతమంది ప్రాంతీయ మరియు జాతీయ క్రీడాకారులు కూడా ఉన్నారు) పాల్గొన్నారు. న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాలలో అత్యధికంగా క్రీడాకారులు పాల్గొన్న టోర్నమెంట్లో ఇది ఒకటిగా నిలిచింది.
మల్లారెడ్డి యానాల (రీజినల్ డైరెక్టర్), శశికాంత్ పసునూరు (రీజనల్ కోఆర్డినేటర్), శిల్పా శ్రీపురం (రీజినల్ కోఆర్డినేటర్) నేతృత్వంలోని ఆటా న్యూ ఇంగ్లండ్ టీమ్ దీనిని నిర్వహించింది, దీనికి ప్రమోద్ రెడ్డి కంకణాల (మసాచుసెట్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు), సోమ శేఖర్ రెడ్డి నల్లా (ట్రస్టీ బోర్డు) మరియు రమేష్ నల్లవోలు (గత ట్రస్టీ బోర్డు) మరియు స్థానిక ఆటా టీమ్ సుక్ష్మ బాచిరెడ్డి, కిరణ్ యనమండ్ర, రామ్ మాకిరెడ్డి, ఉజ్వల్ ఆలూరు, శ్రీనివాస్ రెడ్డి చంద్రపు, రఘు మంతెన, సులీప్ గోస్వామి, అజయ్ అడపా, రోహిత్ కోట్ల, గోపీనాథ్ పచ్చికోరు, సందీప్ బొంతు , ప్రియదర్శిని కుబేర, నాచియప్పన్ మరియు ఎల్సా బెల్మాంట్ తదితరులు హాజరయ్యారు. ఒక అద్భుతమైన టోర్న మెంట్‌ను నిర్వహించినందుకు న్యూ ఇంగ్లండ్ టీమ్‌ను ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజాల అభినందించారు.













