డల్లాస్ లో ఆటా-టాటా ఫండ్ రైజింగ్ మీట్ – 5లక్షల విరాళం
మే 31, జూన్ 1, 2వ తేదీల్లో డల్లాస్ లో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) సంయుక్తంగా నిర్వహించనున్న మెగా కన్వెన్షన్ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. టెక్సాస్‌లో కొప్పెల్‌లోని ఫోర్ పాయింట్స్ షెరాటన్ బాంక్వెట్‌లో విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి 300 మంది హాజరయ్యారు. స్థానిక కమ్యునిటీ నాయకులు, వ్యాపారస్తులు, మద్దతుదారులు 5లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చారు. మన సంస్క తిని ప్రచారం చేయడంతో పాటూ స్నేహితులు, కుటుంబసభ్యులు ఆహ్లాద వాతావరణంలో ఒక్కచోట కలిసి గడిపేలా అమెరికన్ తెలుగు కన్వెన్షన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.













