అమెరికాలో టోర్నడో బీభత్సవం
అమెరికాలోని అలబామా రాష్ట్రం టోర్నడో తుపాను బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. ముఖ్యంగా ఆగ్నేయ అలబామాలో టోర్నడో తీవ్రత ఎక్కువగా ఉంది. వందల సంఖ్యలో చెట్లు నేల కూలిపోగా ఎన్నో ఇళ్లు ధ్వంసం కావడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తుపాను తీవ్రతకు చిన్నారులు సమా 23 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకావం ఉందని అధికారులు భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది హుటాహుటిని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో టోర్నడో వచ్చే అవకాశం ఉండడంతో ఫ్లోరిడా, దక్షిణ కరోలినా, జార్జియా ప్రాంతాల్లోనూ టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు.













