యూఎస్ ఫిల్మ్ ఫెస్టివల్లో అసోమీ సినిమాకు పురస్కారం

అమెరికా ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ నెరేటివ్ ఫీచర్ విభాగంలో అసోమీ సినిమా రెయిన్‌బో ఫీల్డ్ కి అవార్డు లభించింది. కఠిన సమయాల్లో చిన్నారుల పెరుగుదల వంటి సున్నిమతమైన కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ముంబైకి చెందిన బిద్యుత్ కొటోకి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ఎరి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఈఐఎఫ్‌ఎఫ్) అవార్డును దక్కించుకొంది. లెజెండ్రీ నటుడు విక్టర్ బెనర్జీ కూడా ఈ సినిమాలో నటించారు. అస్సాంకి చెందిన ఈ సినిమా కథ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగానికిమందికిపైగా రిలేట్ అయ్యే విధంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్వేగాలు అందరిలో ఒకే విధంగా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించబడింది.