NATS: నాట్స్ సంబరాల్లో అష్టావధానం
‘అవధానం’, తెలుగు వారికి మాత్రమే సొంతమైన ఒక విశిష్టమైన సాహితీ ప్రక్రియ. ఈ అష్టావధానం కార్యక్రమాన్ని నాట్స్ (NATS) సంబరాల్లో ఏర్పాటు చేశారు. అవధాని బ్రహ్మశ్రీ నేమాని సోమయాజులుగారు ఈ అష్టావధానం చేయనున్నారు. సంచాలకులుగా శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ) ఉంటారు.
పృచ్ఛకుల బృందంలో పలువురు ఉన్నారు.
నిషిద్ధాక్షరి: మురళీ కృష్ణ మేడిచెర్ల, సమస్య: శ్రీ కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని, దత్తపది: రామ జోగయ్య శాస్త్రి దరివేముల, వర్ణనము: శ్రీమతి డా సుమన మెట్టుపల్లి, సంస్తాక్షరి: శ్రీనివాస్ నాగుపల్లి, అనువాద పద్యం: విజయసారథి జీడిగుంట, చందోభాషణం: శ్రీమతి రాధిక నోరి, అప్రస్తుత ప్రసంగము: తనికెళ్ళ భరణి చేయనున్నారు.







