2028 విశ్వ క్రీడలకు.. లాస్ ఏంజెలెస్‌కు సన్నాహాలు
ఫ్యాషన్ నగరంలో ఒలింపిక్స్ ముగుస్తుండటంతో 2028 విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న లాస్ ఏంజెలెస్ సన్నాహాలు మొదలు పెట్టింది. పారిస్ క్రీడలు ఎలా జరిగాయి? ఏది పనిచేసింది? విజయవంతానికి కారణాలేంటి? పొరపాట్లు ఏమైనా జరిగాయా? అన్న విషయాలపై లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ నిర్వాహకులు దృష్టిసారించారు. మూడో మారు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న లాస్ ఏంజెలెస్ చివరి సారిగా 40 ఏళ్ల క్రితం విశ్వ క్రీడలు నిర్వహించింది. 2028 లాస్ ఏంజెలెస్ చీప్ అథ్లెట్ అధికారి జానెట్ ఇవాన్స్ పారిస్ ఒలింపిక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అమెరికాకు స్విమ్మింగ్‌లో నాలుగు స్వర్ణ పతకాలు అందించిన జానెట్, ప్రపంచ రికార్డులు కూడా నమోదు చేసింది. మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొని 3 క్రీడాగ్రామాల్లో బస చేసిన అనుభవం నాకుంది. క్రీడాకారులకు ఎలాంటి అనుభవం లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. రోజూ వేల మంది అథ్లెట్లకు ఆహారం అందిస్తాం. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పరిశీలించాలి అని జానెట్ తెలిపింది.







