అమెరికా ఆర్థిక మంత్రితో అరుణ్‌జైట్లీ భేటీ
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల మంజూరును కఠినతరం చేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆ దేశ ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్యూచిన్తో తొలిసారిగా సమవేశమైన సందర్భంగా ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అంతకుముందు వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్తోనూ చర్చించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచబ్యాంకుల వసంతకాల సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన జైట్లీ వివిధ ద్వైపాక్షిక అంశాలతో పాటు దీనిపైనా దృష్టి సారించారు. మ్నూచిన్తో జరిగిన సమావేశంలో ఇండో-యూఎస్ పెట్టుబడుల చొరవ, జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధి (ఎన్ఐఎఫ్ఎఫ్), ఆకర్షణీయ నగరాల అభివృద్ధి తదితర విషయాలపై చర్చించారు. అమెరికా ఆర్థిక రంగ ప్రగతికి భారత నిపుణులు ఎంతగానే కృషి చేస్తున్నారని, వీసాల మంజూరులో ఉదారంగా ఉండాలని కోరారు.













