అర్ధ శతాబ్దిలో అమెరికా కథ పుస్తకావిష్కరణ
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలుగు వెన్నెల బృందం, తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా హాజరైన సాహితీవేత్త కొలకలూరి ఇనాక్ సమాజం సాహిత్యం పరస్పర ప్రభావాలు అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం వంగూరి చిట్టెన్ రాజు ప్రధాన సంపాదకులుగా, డా.సి.మృణాళిని సహ సంపాదకురాలిగా కేంద్ర సాహిత్య అకాడమీ (ఢిల్లీ) ప్రచురించిన అర్ధ శతాబ్దిలో అమెరికా సంకలనాన్ని ఆవిష్కరించారు. విదేశాల్లో నివసిస్తున్న రచయితల కథలు ప్రచురించడం సాహిత్య అకాడమీ చరిత్రలో ఇదే తొలిసారి అని చిట్టెన్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. తొలుత సుదేశ్ పిల్లుట్ల స్వాగతోపన్యాసం చేయగా, ప్రముఖ రచయిత డా. గిరిజా శంకర్ వయసు మీరిన చమత్కారం అనే అంశంపై ప్రసంగించారు. నిర్వాహకులు శాయి రాచకొండ, హ్యూస్టన్ సాంస్కృతి సమితి అధ్యక్షురాలు ఆశాజ్యోతి, సభ్యులు రామ్ గొడవర్తి, ట్రస్టీ ఇందిర చెరువు, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.













