GTA: జిటిఎ తొలి మెగా కన్వెన్షన్ కు ఏర్పాట్లు పూర్తి
విశ్వ వ్యాప్తమైన తెలంగాణ సమాజాన్నీ ఏకం చేయాలనే మహోన్నత ఆశయం, బలమైన సంకల్పంతో రూపుదిదుకున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ .. తొలి కన్వెన్షన్ ఈనెల 27, 28 తేదీలలో హైదరాబాద్లోని అక్షయ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించనున్నారు. గత మూడేళ్ళుగా తెలంగాణ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ అభివృద్ధిలో జిటిఎ చేస్తున్న కృషిని చాటిచెప్పేలా ఈ వేడుక జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి పలువురు రాష్ట్ర స్థాయి ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ఇప్పటికే వీరందరికీ ఆహ్వానాలు అందజేశారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల్లో ఉన్న సియివోలు, ప్రముఖులు, తెలంగాణలోని ప్రముఖ రాజకీయ వేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ లు, న్యాయ కోవిదులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే వివిధ రంగాల ప్రముఖుల సమక్షంలో కన్వెన్షన్ ఘనంగా సాగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ లాంచింగ్, అతిధులకు ఆహ్వానాలు పంపించడం వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సుమారు అయిదు వేలకి పైగా అతిధులు హాజరుకానున్నట్టు నిర్వాహకులు పేర్కొంటున్నారు.
రెండు రోజుల కార్యక్రమాలకి సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ కళాకారులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ కళాకారులతో ప్రదర్శనలు మరింత శోభను తీసుకురానున్నాయి. తెలంగాణ ప్రగతిలో, ప్రతి అడుగులో ఎన్నా రైలని ఏకం చేసేలా ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఎక్సిక్యూటివ్ టీం సభ్యులు ఫౌండర్ అండ్ చైర్ మ్యాన్ ఏ.మల్లారెడ్డి, ప్రెసిడెంట్ పి. శ్రీనివాస్ రెడ్డి, కన్వెన్షన్ చైర్ టి. విజయేందర్ రెడ్డి, కన్వెన్షన్ కో చైర్ తిరుమల రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్-కన్వీనర్ కె.అభిషేక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో కన్వీనర్ పి.రెడ్డి పెండ్యాల, కో కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, కో ఫౌండర్ పి. శ్రవణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సమత తల్లా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మంజుల రావు, కో ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, కో ఆర్డినేటర్ అభిషేక్ రెడ్డి, ట్రెజరర్ బి. అనూష రెడ్డి, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ రెడ్డి, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ తిరుమల రెడ్డి, గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ గుండా, వాషింగ్టన్ డీసి అధ్యక్షుడు మరియు గ్లోబల్ మీడియా చైర్ రాము ముండ్రాతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బోర్డ్ అఫ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి రెడ్డి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చుండూరు కోరుతున్నారు.






