ATA: బోస్టన్ లో ఘనంగా దసరా వేడుకలకు ఏర్పాట్లు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) బోస్టన్ లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు – 2025 నిర్వహించడానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్ 18 సాయంత్రం 6:00 గంటలకు ఈ ఉత్సాహవంతమైన వేడుకలు ప్రారంభమవుతాయి. హడ్సన్‌లోని పోర్చుగీస్ క్లబ్‌లో సాంస్కృతిక అనుభూతిని, వినోదాన్ని పంచి పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆటా తెలిపింది.
ఈ వేడుకల్లో ప్రముఖ గాయని సుమంగళి లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. అలాగే డీజే బై రోహన్ తన ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. స్పాన్సర్‌ల నుండి రాఫెల్ టిక్కెట్లు, డిన్నర్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఓపెన్ డ్యాన్స్ ఫ్లోర్ వంటి ఏర్పాట్లతో అందరిలో ఉత్సాహం నింపేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆటా (ATA) నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకల్లో పాల్గొనే వారు 12 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారు $70, ఐదు నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలకు $35గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ వేడుక్లో ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఆటా (ATA) కార్యనిర్వాహక కమిటీ, అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రధాన కార్యదర్శి శారద సింగిరెడ్డి సహా ఇతర సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.