ఆటా కన్వెన్షన్ 2024, అట్లాంటా – మార్మోగుతున్న ఏర్పాట్లు, తరలి వస్తున్న అతిరథ మహారధులు
ఇటీవల అమెరికాలో ఒక ప్రముఖ నగరంలో జరిగిన చిన్న సంఘటన, 10-12 మంది కుర్రాళ్ళు, సుమారు 25-30 ఏళ్ళు ఉంటాయి, ఒక రెస్టారెంట్ లో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఉత్సుకత ఆపుకోలేక, వాళ్ళు వెళ్లేప్పుడు దేన్ని గురించి మాట్లాడుకుంటున్నారని అడిగితే, ఏముందండీ, ఎన్నికలు, ఆటా కన్వెన్షన్, సినిమాలు అన్నారు. మరి ఆటా కి అట్లాంటా వెళ్తున్నారా అని అడిగితే, అవునండీ, కొన్ని ఫ్యామిలీస్ కలిసి డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నామన్నారు. జూన్ 7 నుండి 9 వరకు అట్లాంటాలో అత్యంత భారీగా, మిన్నంటేలా జరగనున్న ఆటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి.
సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో జరగబోతున్నాయి. ఆటా వారు యువత తమకు ఎంత ముఖ్యమో చాలా సార్లు తెలియజేసారు, చేతల్లో చూపిస్తున్నారు కూడా. యువతకు ఉపయోగకరంగా మరియూ సరదాగా సాగే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వారికి ఒక ప్రత్యేక కమిటీ ఉండడం ముదావహం. వినోద, వివేక, విజ్ఞానాల కలబోతగా ఉండబోతున్న కన్వెన్షన్ గురించి ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక విందు సరే సరి, తెలుగు వారి వంటకాలు నోరూరేలా, ఘుమ ఘుమ లాడుతూ చాలానే ఉండబోతున్నాయి.
వివిధ రంగాలలో ప్రముఖులకు ఆటా అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. పొద్దు పోయాక జరిగే మ్యూజికల్ కాన్సర్ట్ లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. మహిళా సాధికారికత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశిష్ట అతిథుల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు శ్రీ. రేవంత్ రెడ్డి, శ్రీ. జగన్ మోహన్ రెడ్డి ని, ఎంతో మంది ప్రముఖ నటులను, దర్శకులను, సాహితీ వేత్తలను, శాస్త్రఘ్నులను, వ్యాపారవేత్తలను, న్యాయ కోవిదులను, వివిధ రంగాలలో నిష్ణాతులను ఆటా నాయకత్వం ఆహ్వానించడం జరిగింది. భారత దేశం నుండి ఇప్పటికే విజయ్ దేవరకొండ, జాహ్నవి కపూర్, మెహ్రీన్, శ్రీకాంత్, థమన్, అనూప్ రూబెన్స్, సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి వంటి వారు వస్తున్నామని నిర్ధారించారు, ఇంకా తెలంగాణా క్యాబినెట్ మంత్రులు, ఎందరో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఒకే చోట జరగడం చిరస్మరణీయం. ఆలస్యం దేనికీ, రండీ కదలి రండి, ఈ అత్యద్భుతాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరములకు https://ataconference.org, ఎర్లీ బర్డ్ టికెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registration ని సందర్శించండి.
జార్జియా కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణం చాలా పెద్దది. కన్వెన్షన్ కి 15 నుండి 20 వేల మంది వస్తారని అంచనా, వీళ్ళందరికీ ఈ సెంటర్ చాలా వసతిగా ఉంటుంది. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో చాలా టీములు వెళ్లి సదుపాయాలు చూసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మధు గారు మాట్లాడుతూ, వేల మంది వందల రోజులు ఈ కన్వెన్షన్ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు, ఇది అభినందనీయం. అందరూ రండి, కన్వెన్షన్ లో పాలు పంచుకోండి అన్నారు. అమెరికా విషయానికి వస్తే, జా2ర్జియా గవర్నర్ శ్రీ. బ్రయాన్ కెంప్ ని ఆహ్వానించారు, ఆయన వీలుంటే తప్పకుండా వస్తాను అన్నారు.
అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ శ్రీ. రమేష్ బాబు లక్ష్మనన్ ను సాదరంగా ఆహ్వానించారు. కన్వీనర్ కిరణ్ గారు మాట్లాడుతూ, కాన్సులేట్ జనరల్ గారు రావడం కార్యక్రమానికి ఎంతో వన్నె తెస్తుందని శ్లాఘించారు. అలానే, లోకల్ లీడర్స్ ఎందరినో పిలిచామనీ, వారందరూ విచేస్తున్నారని సెలవిచ్చారు. కాంగ్రెస్ మెన్ రిచ్ మెకార్మిక్, సెనేటర్ జాన్ ఆసాఫ్, స్టేట్ రెప్రెసెంటేటివ్ టాడ్ జోన్స్, కమీషనర్లు లారా సేమాన్సన్, ఆల్ఫ్రెడ్ జాన్, సిటీ కౌన్సిల్ దిలీప్ తున్కి, బాబ్ ఎర్రమిల్లి, నరేందర్ రెడ్డి, ఇంకా సిటీ మేయర్లు, ఇతర నాయకులను ఆహ్వానించడం, వారు మన్నించడం జరిగింది. కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ పలు కమిటీలను, నాయకులను, వాలంటీర్లను అనుసంధాన పరుస్తూ, ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇండియా నుండి తేవలసిన వస్తువులు. ఇక్కడ కావలసినవి ఇప్పటికే సమకూరుస్తున్నారు. ఎక్సిబిట్స్ విషయానికి వస్తే, దాదాపు 200 లకు పైగా స్టాల్ల్స్ ఉండబోతున్నాయి. ఇంకా చాలా మంది పెడదామనుకున్నా, ఇంక అవకాశం లేదని నిర్వాహకులు చెప్పారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బూజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తో పాటు ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విశేషాలు ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఈ మధ్యలో మీకు మరిన్ని వివరాలు కావాలంటే, ఆటా సోషల్ మీడియా, వెబ్ సైట్, టీవీ ఇంటర్వ్యూ లు, పత్రికలు చూస్తూ ఉండండి.







