TANA: తానా మహాసభలు…. డిట్రాయిట్‌లో తెలుగువాళ్ళ సందడి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరుగుతుండటంలో అమెరికాలోని వివిధ నగరాలో నుంచి వచ్చిన తానా నాయకులు, సభ్యులు, డోనర్లు, స్టాల్స్ ఏర్పాటు చేయనున్న వివిధ కంపెనీల ప్రతినిధులతో, ఇతరులతో వేదిక జరుగుతున్న ప్రాంగణం, చుట్టుప్రక్కల ఉన్న హోటళ్లు తెలుగువాళ్ళతో నిండిపోయి కనిపిస్తోంది. హోటళ్ళ బయట, వేదిక జరుగుతున్న ప్రాంగణం దగ్గర తెలుగువాళ్ళ సందడి కనిపిస్తోంది.
ఈ మహాసభల్లో భాగంగా జరుగుతున్న ఏర్పాట్లను కాన్ఫరెన్స్ కన్వీనర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ నరేన్ కొడాలి కూడా వేదిక ప్రాంగణంలో ఉన్నారు. కాన్ఫరెన్స్ నాయకులు కిరణ్ దుగ్గిరాల, సునీల్ పంట్ర, జో పెద్దిబోయిన కూడా ఏర్పాట్లపై కమిటీ సభ్యులకు సూచనలిస్తున్నారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు టాలీవుడ్‌కు చెందిన పలువురు అమెరికాకు పయనమయ్యారు. ఇప్పటికే కాన్ఫరెన్స్‌కు చేరుకున్న సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, గాయని సునీత తదితరులు వెన్యూ ప్రాంగణంలో రేపటి ప్రోగ్రామ్ కోసం రిహార్సల్ చేస్తూ కనిపించారు. ఫుడ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న నరహరి తన టీమ్ తో కలిసి ఆతిధ్య ఏర్పాట్లను చేస్తున్నారు.
బాంక్వెట్ కార్యక్రమంతో తానా మహాసభలు ప్రారంభం కానున్నాయి. జూలై 3వ తేదీ సాయంత్రం 5 నుంచి బాంక్వెట్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాతలకు, సభ్యులకు ఇతరులకు ఆరోజునే పాస్ లు ఇస్తుంటారు. ఈసారి తానా కాన్ఫరెన్స్ నాయకులు చివరినిముషంలో గందరగోళం వద్దనుకుని ముందురోజే అందరికీ పాస్ లను అందజేశారు. బాంక్వెట్ కార్యక్రమంతోపాటు రెండురోజుల తానా కార్యక్రమాలకు సంబంధించిన పాస్ లను కూడా అందజేస్తున్నారు.
ఈ కాన్ఫరెన్స్‌లో తమ స్టాల్ ను ఏర్పాటు చేసేందుకు సిబ్బందితో కలిసి అశ్రిత గ్రూపు మేనెజింగ్ డైరెక్టర్ సత్యమూర్తి కూడా తానా మహాసభల వేదిక ప్రాంగణంలో కనిపించడంతోపాటు తమ సిబ్బందికి సూచనలు ఇస్తుండటం కనిపించింది.
ఇలా ఇతర స్టాల్స్ నిర్వాహకులు కూడా తమతమ సామాగ్రితో వెన్యూ ప్రాంతానికి వచ్చి రేపటికల్లా తమ స్టాల్ సిద్ధం చేసుకునేందుకు ఉపక్రమించారు.
తానా మహాసభల ప్రారంభానికి ముందురోజే ఇంత సందడి కనిపిస్తే రేపు సమావేశాలు ప్రారంభమైనాక భారీ ఎత్తున జనాలు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముందుస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని కాన్ఫరెన్స్ టీం సిద్ధంగా ఉంది.
మూడురోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ గాయని చిత్ర సంగీత విభావరి, సినీ నేపథ్య గాయకురాలు సునీత, గాయకుడు ఎస్.పిబి. చరణ్‌తో కూడా లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు అందరినీ అలరించనున్నాయి. నేపథ్య గాయనీగాయకులు కూడా ఈ మహాసభల్లో తమ పాటలతో ఆనందపరచనున్నారని తెలిపారు. ప్రముఖ హీరోయిన్ సమంత ఈ మహాసభలకు వస్తున్నారు. తెలుగు కమ్యూనిటీ మహాసభలకు ఆమె రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కూడా హాజరవుతున్నారు. ఇలా ఎంతోమంది ఈ మహాసభలకు వస్తున్నారు. తానా సభలకు రావాలనుకునే వారికోసం రిజిస్ట్రేషన్ లింక్ ను ఇస్తున్నాము.
https://tanaconference.org/event-registration.html
Click here for TANA Conference Arrangements







