అరిజోనాలో ఆందోళనలు ఉధృతం
అరిజోనాలో సమ్మె విరమణకు టీచర్లు నిరాకరించారు. దీంతో, ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. దాదాపు 20వేల మంది టీచర్లు వరుసగా ఐదవ రోజు రాధానికి చేరుకుని తమ నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. అరిజోనా గవర్నర్ డౌగ్ డూసే ప్రకటించిన పాఠశాల నిధుల ప్రణాళికను టీచర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా అభివృద్ధి నిరోధక యూనియన్లు, అయిన అరిజోనా ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఏఈఏ), దాని అనుబంధ సంస్థ అరిజోనా ఎడ్యుకేటర్స్ యునైటెడ్ ఫేస్బుక్ గ్రూప్ (ఏఈయూ) సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి బడ్టెట్ ప్రణాళికను గొప్ప చర్యగా పేర్కొన్నాయి. బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించినట్టయితే టీచర్లు విధులకు హాజరవుతారని ప్రకటించాయి. అయితే, ఉపాధ్యాయులు మాత్రం సమ్మె విరమణకు ఒప్పుకోవడం లేదు. ఈ ఒప్పందాన్ని అంగీకరించి యూనియన్ నేతలు అమ్ముడుపోయారంటూ టీచర్లు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ ప్రకటించారు.













