అమెరికాలో ఉపాధ్యాయుల ఆందోళనలు
అమెరికాలో ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. పాఠశాల యాజమాన్యాలు అందిస్తున్న చాలీచాలనీ వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నామని, తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎర్ర దుస్తులు ధరించి అరిజోనా కాపిటల్ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నినాదాలు చేశారు. భారీ ర్యాలీ తీశారు. విద్యాసంస్థలకు నిధులు మంజూరు చేసి విద్యాప్రమాణాలు పెంపొందించాలని కోరారు. అయితే, ట్రంప్ సర్కార్కు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఉవ్వెత్తున ఎగిసిన ఉపాధ్యాయుల ఆందోలన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ఆదిలో వెనుకంబజ వేశాయి. ఆందోళన కార్యక్రమాలు ఉధృతం కావడంతో పలు పత్రికలు ప్రచురించాయి. గార్డియన్ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికాలోని పలు నగరాల్లో కొనసాగిన ఉపాధ్యాయుల ర్యాలీలో దాదాపు 50 వేల మంది పాల్గొన్నారు.













