NATS: నాట్స్ సంబరాల్లో అరవైలో ఇరవై…
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు ‘‘అమెరికా తెలుగు సంబరాలు’’ పేరుతో జూలై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పెద్దలకోసం ఓ కార్యక్రమాన్ని పేరెంట్స్ మీట్ అండ్ గ్రీట్ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అరవైలో ఇరవై పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీనియర్లకోసం గేమ్ షో వంటి కార్యక్రమాలతోపాటు ఏమి అమెరికానో నాయనా..,చీరకట్టు వర్సెస్ పంచెకట్టు, పాడనా తెలుగు పాట వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కమిటీ నాయకులు కోరారు.







