మళ్లీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఖాయం
రాష్ట్రంలో కనీసం 130 శాసనసభ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని, చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గోదాముల సంస్థ చైర్మన్, టీడీపీ జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. అమెరికాలోని న్యూ జెర్సీలో జరిగిన టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత నెల 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో వేలాది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నా ప్రజలు అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్లలో నిలబడి ఓటు వేసారంటే చంద్రబాబు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు. ఈ సమావేశానికి నాటా మాజీ అధ్యక్షుడు ఎన్ఆర్ఐ టీడీపీ నేత మన్నవ మోహన్‌కృష్ణ అధ్యక్షత వహించారు. నల్లమల్ల రాధా, నూతలపాటి ప్రసాద్, మెందడి శ్రీహరి, వెనిగళ్ల రంగా, దేవినేని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.













