యాపిల్ ఉదారత… పేదలకు ఇళ్ల కోసం రూ. 17 వేల కోట్ల సాయం!
అందుబాటు ధరల్లో ఇళ్లు లభించక, తీవ్ర అవస్థలు పడుతున్న పేదల కోసం భూరి విరాళాన్ని అందించేందుకు సాఫ్ట్వేర్, స్మార్ట్ఫోన్ దిగ్గజ సంస్థ యాపిల్ ముందుకొచ్చింది. వచ్చే రెండేళ్ల కాలంలో కాలిఫోర్నియాలో పేదలకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం రూ.17.692 కోట్లను సాయం చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ చీప్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపారు. కాలిఫోర్నియాలో నిరాశ్రయులుగా ఉన్న వారిని ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, ఇప్పటికే పేదలకు ఇళ్ళ నిర్మాణాల కోసం గూగుల్, ఫేస్బుక్ సంస్థలు రూ.14 వేల కోట్లకు పైగా సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.













