ఆప్కో ఆధ్వర్యంలో ఘనంగా అట్లతద్ది వేడుకలు
సెంట్రల్ ఒహయోలో ఆంధ్ర పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహయో (ఆప్కో) ఆధ్వర్యంలో నిర్వహించిన అట్లతద్ది వేడుకలు వైభవంగా జరిగాయి. ఆంధ్రా సంప్రదాయ పద్దతిలొ దాదాపు 60 మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా తెల్లవారుజామున 3 గంటలనుండి రాత్రి వరకు ఉప వాసముండి శాస్త్రోక్తంగా గౌరి పూజతోపాటు అన్ని పద్దతులను ఎంతో నిష్థగా పాటించి వాయనాలు ఇచ్చుకొవదం పుచ్చుకొవదంతో పరిపూర్ణముగా వ్రతాన్ని పూర్తి చేసి చంద్రోదయం తరువాత 30 పైగా ఆంధ్రా సంప్రదాయక వంటకాలతొ విందు భొజనాన్ని ఆస్వాదించారు. తరువాత స్టార్ మహిళా వినోద కార్యక్రమంలో అందరు పాల్గొన్నారు. ఇందులో ఇదుగురు మహిళలు విజేతలుగా నిలిచారు.
అమెరికలో అట్లతద్ది వేడుకలు జరగటము ఇదే మొదట సారి కావడం విశేషం. గత 2 సంవత్సరాలుగా ఆప్కో విన్నూత్నమైన కార్యక్రమాలతో అతితక్కువ సమయంలో తెలుగు వారికి అత్యంత చేరువైన సాంస్కృతిక సేవా సంస్థ. ఆప్కో కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షురాలు సుశీల ఉప్పుటూరి అధ్వర్యంలో ఈ వేడుకలు విజయవంతంగా జరిగాయి. కార్యనిర్వాహక కమిటీసభ్యులు వేణు పసుమర్తి, రవి నవులూరి, అపర్ణ సంగా, వాణి గద్దె,అనిత ఈడ్పుగంటి, ఉమ మునగాల, వీరేష్ ఊల్లిగడ్ల, రాజ బొమ్మన, వెంకట అరవీటి, నూక రాజు, లత సాదినేని, జయ యర్రంశెట్టి, మాధవి పుట్టి మరియు స్వచ్ఛంద సేవకులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు.













