Boston: బోస్టన్‌లో స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ఏపీ యువకుడు మృతి

అమెరికాలోని బోస్టన్‌లో (Boston) చదువుకుంటున్న తెలుగు విద్యార్థి పాటిబండ్ల లోకేష్ (23) స్విమ్మింగ్ పూల్‌లో మునిగి (Drowning)చనిపోయాడు. మార్టూర్‌కు చెందిన లోకేష్.. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తిచేసుకొని, ఉద్యోగం సంపాదించాడు. గత 8 నెలలుగా బోస్టన్‌లోనే (Drowning) ఉంటున్నాడు. ఈ విషాద వార్తను గురువారం రాత్రే కుటుంబానికి తెలియజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లోకేష్ భౌతికకాయాన్ని స్వగ్రామానాకి పంపేందుకు బోస్టన్‌లోని (Drowning) సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.