అమెరికా యూనివర్సిటీలతో ఒప్పందాలు : గంటా
అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒహియోలోని సిన్సినాటీ విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. సిన్సినాటి వర్సిటీ బోర్డ్ ఆఫ్ డెరెక్టర్లు ఇతర అధికారులతో సమావేశమై నవ్యాంధ్రలో ఫ్యాక్టలీ ప్రోగ్రాంపై చర్చించారు. వర్సిటీలోని బోధనా పద్ధతులను పరిశీలించారు. నవంబరు మూడో వారంలో రాష్ట్రాన్ని సందర్శిస్తామని ఈ సందర్భంగా సిన్సినాటి వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆ పర్యటనలో అధ్యాపకులకు శిక్షణకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఫ్రాంక్లిన్ యూనివర్సిటీని కూడా సందర్శించిన గంటా వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ క్రిష్ట ఫర్తో ఆన్లైన్ కోర్సులపై చర్చించారు. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తామని ఫ్రాంక్లిన్ వర్సిటీ ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం ఆన్లైన్ కోర్సులపై ఎంవోయూ కుదుర్చుకున్నారు.













