ట్రంప్-కిమ్ హోటల్ బిల్లు మేం కడతాం
సింగపూర్ వేదికగా ఈ నెల 12న జరగనున్న అమెరికా, ఉత్తరకొరియా దేశాధినేతల సమావేశంపై ఇటీవల వస్తున్న అనుమానాలపై యాంటీ న్యూక్లియర్ గ్రూప్ పటాపంచలు వేసింది. ట్రంప్-కిమ్ భేటీ అయ్యే పుల్లెర్టన్ హోటల్ బిల్లు విషయంలో అమెరికా అధికారులు తర్జనభర్జన పడుతున్న నేపథ్యంలో ఆ బిల్లును తామే భరిస్తామని అణ్వాయుధ వ్యతిరేక సంఘం ప్రకటించింది. ట్రంప్-కిమ్ హోటల్ బిల్లు ఖర్చు ఎంతైనా తామె కడతామని అంతర్జాతీయ అణ్వాయుధ వ్యతిరేక ప్రచార సంస్థ (ఐసీఏఎస్) ప్రతినిధి అకీరా కవాసకీ తెలిపారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఐసీఏఎన్కు గతేడాది నోబెల్ ప్రైజ్ కింద 1.1 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అయితే ఆ డబ్బుతో పాటు ఇంకా ఇతర నగదును కూడా ట్రంప్-కిమ్ భేటీ నాటి హోటల్ బిల్లు కింద కడతామని పేర్కొన్నారు. అయితే మొత్తం ఎంత డబ్బు ఖర్చుచేస్తారన్న విషయాన్ని వెల్లడించేందుకు నిరాకరించిన కవాసకీ, నోబెల్ పురస్కారం కింద తమ సంస్థకు అందిన నగదును మాత్రం ఇస్తామన్నారు.













