Food Collection: సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో వార్షిక ఫుడ్ డ్రైవ్ – 2025!
న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం, సాయి శివ విష్ణు టెంపుల్ న్యూజెర్సీ (SSVT NJ) ఆధ్వర్యంలో పేదలకు సహాయం చేసే ఉద్దేశ్యంతో ‘ఎస్డీపీ (SDP) ఛారిటీ సేవ దీపావళి యాన్యువల్ ఫుడ్ డ్రైవ్ – 2025’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఫుడ్ కలెక్షన్లో (Food Collection) భాగంగా పాడవని ఆహార పదార్థాలు (నాన్ పెరిషబుల్ ఫుడ్), డబ్బాలో నిల్వ ఉంచిన కూరగాయలు, బాక్స్‌లలో ఉన్న కేక్ మిక్స్, మాకరోనీ మిక్స్‌లు వంటి వాటిని సేకరిస్తారు. భక్తులు ఎలాంటి ఓపెన్ లేదా గాజు వస్తువులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 22 శనివారం వరకు ఆహార పదార్థాలు (Food Collection), విరాళాలను ఈ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తామని నిర్వాహకులు తెలిపారు. భక్తులు నగదు రూపంలో కూడా విరాళాలు అందించవచ్చు. దాతలు (Donars) తమ వస్తువులను పీఠం ముందు ఉంచిన పెద్ద ప్లాస్టిక్ కంటైనర్‌లో వేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి, మరిన్ని వివరాల కోసం రఘుశర్మ శంకరామంచి (732-516-359-8178), టెంపుల్ ఫ్రంట్ డెస్క్ (732-809-1200, 732-662-3250)ను సంప్రదించవచ్చు.







