TANA: తానా మహాసభల్లో ‘ఆశ్రిత ఇన్‌ఫ్రా లక్కీ డ్రా’ విజేతల పేర్లు ప్రకటన
తానా (TANA) 24వ కాన్ఫరెన్స్‌లో ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ (Aasritha Infra Project) నిర్వహించిన లక్కీ డ్రా విజేతలను ప్రకటించారు. అంతకుముందు కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. కాన్ఫరెన్స్ స్పాన్సర్ ఆశ్రిత ఇన్‌ఫ్రా ఎండీ సీఈవో సత్యమూర్తి తమకు ఎంతో అండగా నిలిచారని, తానా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తాము మద్దతిస్తామన్నారని చెప్పారు. ఇలా మంచి మనసుతో మాట్లాడిన సత్యమూర్తి గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఏరో విల్లాస్ స్టాల్‌లో అందించిన ర్యాఫిల్ టికెట్స్ విజేతలను ప్రకటించారు. భరత్, వెంకట్ ఎస్, శ్రిషిక నల్ల, ఉజ్వల్, సువీనా పర్చూరి, రాహుల్ జీ, సుధ, కౌశిక్.. మొత్తం 8 మంది విజేతల పేర్లు వెల్లడించారు. వీరికి ఐప్యాడ్లు, 84 అంగుళాల టీవీలు, సౌండ్ బాక్సులు బహుమతులుగా అందించనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఏరో విల్లాస్ సత్యమూర్తి.. ‘తానా కాన్ఫరెన్స అంగరంగవైభవంగా జరిగింది. కార్యక్రమానికి రాగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని చూడగానే ఎంతో ఉత్సాహంగా అనిపించింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని సత్కరించుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. తమ కంపెనీని ఎంకరేజ్ చేసిన మురళీ మోహన్ గారికి అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో నిఖిల్, ప్రముఖ హీరోయిన్ సమంత, టీవీ5 మూర్తి అందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లకోసారి జరిగే తెలుగువారి పండుగ తానా మహాసభలు. అలాంటి వేడుకకు నన్ను ఆహ్వానించిన తానా లీడర్‌షిప్‌కు, ముఖ్యంగా ఉదయ్ కుమార్, నాదెండ్ల గంగాధర్, సునీల్ బాంద్రాకు ధన్యవాదాలు’ అని చెప్పారు. ఈ సందర్భంగా తానా సభ్యులందరికీ తమ కంపెనీ పది శాతం డిస్కౌంట్ అందిస్తామని బంపరాఫర్ ప్రకటించారు.







