ఫ్లోరిడా గవర్నర్ రేసులో తొలి నల్లజాతీయుడు
ఫ్లోరిడా గవర్నర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మంగళవారం జరిగిన ప్రైమరీలలో వామపక్షవాది, అమెరికాలో గవర్నర్ పదవికి పోటీ పడుతున్న తొలి నల్లజాతీయుడయిన ఆండ్రూ గిలమ్ విజయం సాధించారు. ఆయనకు కీలకమైన వర్కింగ్ ఫ్యామిలీస్ పార్టీ, వుమెన్స్ మార్చ్ ఫోర్లిడా, ఫ్లోరిడా ఇమిగ్రంట్ కోయలియేషన్ వంటి ప్రగతిశీల సంస్థలతో పాటు ఇండిపెండెంట్ వెర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్ మద్దతు లభించిది. ఈ ప్రైమరీలలో తనతో పోటీ పడిన డెమొక్రాటిక్ పార్టీ మాజీ కాంగ్రెస్ సభ్యురాలు గ్వెన్ గ్రాహమ్, మియామీ బిచ్ నగర మేయర్ ఫిలిప్ లెవిన్ను గిలమ్ ఓడించి రేసులో ముందంలో నిలిచారు. ప్రత్యర్థులిద్దరూ భారీయెత్తున ప్రచారం చేయటంతో పాటు డబ్బును కూడా ఖర్చుపెట్టినప్పటికీ, వారిపై గిలమ్ విజయం సాధించటం విశేషం. కార్మికవర్గ కుటుంబానికి చెందిన వాడినని తాను సగర్వంగా చెబుతున్నానని గిలమ్ అన్నారు.













