లైవ్ షోలో కరోనా పరీక్షలు చేయించుకున్న ఆండ్రూ కుమో
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారంలోనే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అంతకుమందు ఆయన మాట్లాడుతూ నగర వాసుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, అందుకు తననే ఉదాహరణగా తీసుకోవాలని అన్నారు. కేసుల సంఖ్య, మృతుల సంఖ్య, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్డౌన్ నిబంధనలపై కుమో లైవ్‌లో రోజూ ప్రజలకు వివరిస్తుంటారు. అమెరికాలో న్యూయార్క్‌లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రేపు నేను ఈ కార్యక్రమంలో కనిపించకపోతే.. నాకు కరోనా సోకినట్టు అని నమూనాల సేకరణ అనంతరం కుమో వ్యాఖ్యానించారు.






