ఆంధ్రావిందు మెనూ చూశారా?
ఆంధ్రాఫ్రైడ్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో ఆధ్వర్యంలో ఏప్రిల్ 28వ తేదీన పాట్లక్ పిక్నిక్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెస్టర్విల్లోని సికమోర్ షెల్టర్ దగ్గర ఉన్న బ్లెండన్ వుడ్స్లో ఈకార్యక్రమం జరగనున్నది. వేణు తలశిల, హనుమాన్ కనపర్తి, శ్రీధర్ వేగేశ్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.
ఈ సందర్భంగా వచ్చినవారికోసం పసందైన రుచికరమైన ఆంధ్రావంటకాలను ఏర్పాటు చేశారు. కాకపోతే అన్నీ కార్యక్రమాల్లోలాగా వంటకాలు వడ్డించడం మామూలే కదా అని అనుకోకండి. ఇక్కడ వడ్డించే వంటకాల మెనూ చూస్తే మీరు వెళ్ళాలనుకోకతప్పదు.
ఉదయం 10 గంటలకు నెయ్యి దోసతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో కడప కారం దోస, ఉల్లి అట్లు, రియల్ వెన్న దోస, మసాల దోస, ఎగ్ దోస, ఛీజ్ దోస, ఇడ్లీ, కర్నూలు వేరుసెనగ పచ్చడి, కోనసీమ కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి, కొబ్బరి కారం ఇందులో వడ్డిస్తారు.
మధ్యాహ్నం 1 గంటకు జరిగే విందు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో కొబ్బరి కారం, అమరావతి ఆవకాయ, గుంటూరు గోంగూర పికెల్, పండు మిరపకాయ పికెల్, గోంగూర పచ్చడి, మామిడి కొబ్బరి పచ్చడి, పెరుగు వడ, ముద్దపప్పు, పొటాటో ఫ్రై, కాలిఫ్లవర్ పీ ఫ్రై, పులిహోర, తెనాలి వంకాయ బఠాని, బీరకాయ శెనగపప్పు, విశాఖ పనసపట్టు కూర, కర్నూలు పచ్చిపులుసు, గిద్దలూరు పప్పు చారు, కోస్తా పచ్చిపులుసు, అమరావతి ఉలవచారు, క్రీమ్, ఆంధ్ర మజ్జిగ చారు, గోదావరి మటన్ కూర, రాయలసీమ నాటు కోడి పులుసు, దివిసీమ చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు, బందరు రాయలవేపుడు, పల్నాడుకోడి వేపుడు, భీమవరం మిక్స్డ్ పలావు, ఆంధ్ర చికెన్ పలవ్, నాయుడు గారి వేట పలావ్, రాయలసీమ రాగి ముద్ద, పులగం, జాగరి, కొబ్బరి అన్నం, విజిటబుల్ పలావు, వైట్ రైస్, వూర మిరపకాయలు, వడియాలు, ఘీ, గడ్డ పెరుగు దీంతోపాటు స్వీట్లను కూడా వడ్డించనున్నారు. ఆత్రేయపురం బెల్లం పూతరేకులు, శాస్త్రిగారి లడ్డు, భీమవరం పాకం గారెలు, అనకాపల్లి బెల్లం జిలేబి, ఆంధ్ర జున్ను, వైజాగ్ రోజ్ మిల్క్, ఫ్రూట్ సలాడ్, బెజవాడ కిళ్ళీ కూడా ఈ విందులో ఉన్నాయి.
సాయంత్రం 4 గంటలకు బజ్జీ టైమ్ పేరుతో వేడివేడి స్నాక్స్ అందిస్తున్నారు. మిర్చి బజ్జి, ఉల్లిపాయల పకోడి, ఆలు బజ్జి, ముంత మసాల, ఉగ్గని, లెమన్, టీ వంటివి ఏర్పాటు చేశారు.













