ఒహాయెలో ఆంధ్రా రుచుల ఘుమఘుమ!
అమెరికాలోని తెలుగువారు ఆంధ్రా ప్రైడ్ ఆఫ్ సెంట్రల్ ఒహాయె పేరిట భారీ విహారయాత్ర (పిక్నిక్) నిర్వహించి సందడి చేశారు. ఒహాయె రాష్ట్రంలోని కొలంబస్లో దీన్ని కోలాహలంగా జరిపారు. బందరు రొయ్యల వేపుడు, పల్నాడు కోడి వేపుడు, ఉగ్గాని, కొబ్బరి కారం లాంటి వంద రకాల తెలుగు సంప్రదాయ వంటకాలను సిద్ధం చేసుకుని రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఆంధ్రా ప్రైడ్ తెలుగు సంఘం పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో వందకుపైగా తెలుగు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నట్లు ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ గాయనీగాయకుల ప్రదర్శనలు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.













