ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ శ్రావణ మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఎఎఎ) ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లను చేసింది. ఎఎఎ కార్యవర్గం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను వివిధ రాష్ట్రాల్లో ఘనంగా జరపనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలలో ఘనంగా జరిగే వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న మనవాళ్ళ చేత కూడా ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఎఎఎ ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం శ్రావణమాసం (భారతమాన క్యాలెండర్ ప్రకారం) 2వ శుక్రవారం నాడు ఆగస్ట్ 25, 2023 పౌర్ణమి రోజున వరలక్ష్మి కుంకుమ పూజ వస్తుంది. ఆరోజున వివాహిత స్త్రీలు ఉపవాసం పాటించి లక్ష్మీదేవిని ప్రార్థించే శుభ దినం. కుటుంబ సభ్యుల శ్రేయస్సును కాంక్షించి ఈ పండుగను వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో విస్తృతంగా, వైభవంగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని కొన్ని చోట్ల సామూహికంగా కూడా జరుపుకుంటారు. మహిళలకు ఇది చాలా ముఖ్యమైన పండుగ కూడా. ఈ నేపథ్యంలో వివిధ నగరాల్లో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని, సామూహిక కుంకుమార్చనను వైభవంగా జరిపేందుకు ఎఎఎ ఏర్పాటు చేసింది.
ఎఎఎ ఫౌండర్, కార్యవర్గం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఫౌండర్‌గా హరి మోటుపల్లి ఉన్నారు. అడ్వయిజరీ బోర్డ్‌లో రవి మందలపు, వెంకట్ ధనియాల, ఓం ప్రకాశ్ నక్క, శివ పోల, సురేష్ కాగితపు, వెంకట కలిదిండి, వంశీ కృష్ణ కోట ఉన్నారు.
గవర్నింగ్ బోర్డ్‌లో అశ్వని ధనియాల, బాలాజీ వీర్నాల, క్రాంతి ఆలపాటి, కళ్యాణ్ కర్రి, కళ్యాణ్ విజయ్ లక్కింసెట్టి, పాండురంగ ముదునూరి, రవి చిక్కాల, శ్రీనివాస అడ్డ, శివశంకర్ చిరుమామిళ్ల, శ్రీనివాస్ సామినేని, శ్రీనివాస్ ఉప్పల గవర్నింగ్ బోర్డ్‌లో ఉన్నారు. మీడియా కో ఆర్డినేటర్‌గా తిరుపతిరావు బైరపునేని వ్యవహరిస్తున్నారు.
ప్రాంతీయ నాయకులుగా కల్లూరి భాస్కర్ రెడ్డి (ఫిలడెల్ఫియా), గిరీష్ ఇయ్యపు (న్యూజెర్సి), ప్రదీప్ సెట్టి బలిజ (డెలావర్) ఉన్నారు.
శ్రావణ మహోత్సవాల కమిటీల నియామకం
ఎఎఎ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న శ్రావణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆయా చోట్ల కమిటీలను ఏర్పాటు చేశారు. పెన్సిల్వేనియా, న్యూ జెర్సి, డెలావేర్ లలో కమిటీలను ఏర్పాటు చేశారు.
పెన్సిల్వేనియా రాష్ట్రంలో నిర్వహించే శ్రావణ మహోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో అను మారినేని, హరి కిషోర్ సబ్బినేని, హరిక పెద్దిరెడ్డి, నవీన్ కట్టమూరి, లత పులి, మాలై గొనుగొంట్ల, సంగమేశ్వర్ దేవిసెట్టి, విశ్వ రుద్రరాజు, రాజి కల్లూరి ఉన్నారు.
న్యూ జెర్సి రాష్ట్రంలో నిర్వహించే శ్రావణ మహోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో ఆకర్ష్ బుదరపు, గౌతమ్ ఓబుల్ రెడ్డి, కిషోర్ కుమార్ అలజంగి, సత్య వెజ్జు ఉన్నారు.
డెలావేర్ రాష్ట్రంలో నిర్వహించే శ్రావణ మహోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో ప్రదీప్ బలిజ, హరిబాబు తూబాటి, శ్రీనివాస్ అడ్డ, వెంకట కలిదింది ఉన్నారు.
డెలావేర్లో ఆగస్టు 26న
ఎఎఎ ఆధ్వర్యంలో డెలావేర్లో శ్రావణ మహోత్సవాలను ఆగస్టు 26, శనివారంనాడు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉచితంగానే ప్రవేశంతోపాటు ఫుడ్‌ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పూజ కార్యక్రమాలతోపాటు, పాటలు, డ్యాన్స్‌లు కూడా ఉంటాయి. మహిళలకోసం ప్రత్యేకంగా స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. డెలావేర్‌లోని మిడిల్ టౌన్‌లోని 1080 బంకర్ హిల్ రోడ్డులో కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు సామూహిక వరలక్ష్మీ కుంకుమ పూజ, 4.30 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన పిండివంటలతో ప్రసాదాల పంపిణీ, సాయంత్రం 5 నుంచి 10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులు ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరిని ఇందులో ఏర్పాటు చేశారు. నేపథ్యగాయనీ గాయకులు పలువురు ఈ కార్యక్రమంలో హిట్టయిన పాటలను పాడనున్నారు.
న్యూజెర్సిలో సెప్టెంబర్ 2న
న్యూ జెర్సిలో సెప్టెంబర్ 2వ తేదీన వరలక్ష్మీ సామూహిక కుంకుమార్చనను ఎఎఎ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలతోపాటు నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశారు. వచ్చినవారికి ఆంధ్ర పిండివంటలతో ప్రసాదాలను అందించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత విభావరిని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. గాయనీ గాయకులు తెలుగు సినిమా హిట్ సాంగ్స్‌ను ఇందులో పాడనున్నారు.
పెన్సిల్వేనియాలో సెప్టెంబర్ 3న
పెన్సిల్వేనియాలో ఎఎఎ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3వ తేదీన వరలక్ష్మీ సామూహిక కుంకుమార్చనను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలతోపాటు నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశారు. వచ్చినవారికి ఆంధ్ర పిండివంటలతో ప్రసాదాలను అందించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ కార్యక్రమంలో సంగీత విభావరి చేయనున్నారు. ప్రముఖ గాయనీ గాయకులు ఇందులో పాటలను పాడి అందరినీ అలరించనున్నారు.













