ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్లెట్ పట్టణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (ఏఏఏ) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సౌత్ కరోలినాలోని చార్లెట్ట్ పట్టణం లో లాన్‌కాస్టర్‌లో ఇండియన్ హై స్కూల్‌లో జనవరి 20వ తేదీన ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సంబరాల్లో ప్రముఖ సంగీత దర్శకులు కోటి అండ్ టీం అందించే మ్యూజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే యువ ట్యాలెంటెడ్ చిన్నారులు తన సాంస్కృతిక ప్రదర్శనలతో అందర్నీ అలరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ సంప్రదాయ బద్ధమైన ఆంధ్ర భోజనం అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరిస్తాయి. అదే సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సంప్రదాయ ఆంధ్ర భోజనం అందనుంది. అలాగే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో తొలి స్థానం పొందిన వారికి 2,516 డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు. రెండో స్థానం పొందిన వారికి 1,116 డాలర్లు, మూడో స్థానంలో నిలిచిన వారికి 516 డాలర్ల నగదు బహుమతులు అందజేయనున్నారు.