కొలంబస్లో ఆంధ్రుల విందు సక్సెస్
కొలంబస్లో ఆంధ్రప్రజలు ఏర్పాటు చేసుకున్న వనభోజనాల కార్యక్రమం విజయవంతం అయింది. సెంట్రల్ ఓహాయో ఆంధ్రుల సంఘం (ఆప్కో) ఆధ్వర్యంలో జరిగిన ఈ వనభోజనాల కార్యక్రమంలో దాదాపు 140కు పైగా ఆంధ్రా సంప్రదాయక వంటకాలు వడ్డించారు. దాదాపు 800మంది ఇందులో పాల్గొని ఉత్సాహంగా, ఆటపాటలతో గడిపారు. కరోనా భయంతో ప్రత్యక్షంగా కలుసుకోని ఆంధ్రులు ఈ వనభోజనాల కార్యక్రమం కారణంగా ండేళ్ల అనంతరం స్థానిక ప్రవాసాంధ్రులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకుని ఆహ్లాదంగా గడిపారు. కమిటీ సభ్యులు నాగేశ్వరావు మన్నే, సుశీల ఉప్పుటూరి, వేణు తలశిల, శ్రీదర్ వెగేశ్న, శ్రీనివాస్ సంగా, భ్రమరా, వేణు పసుమర్తి, రవి నవులూరి, సునిల్ వెగేస్న, మురళి పుట్టి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.













