సీఎం చంద్రబాబుకు ఐరాస ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొంటున్న చొరవకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ విషయంలో మార్గ దర్శనం చేయాలని ఐక్యరాజ్యసమితి నుంచి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. వచ్చే నెల 24న న్యూయార్క్లో నిర్వహిస్తున్న ”ఆర్థిక సుస్థిరత, వ్యవసాయంలో సవాళ్లు, అవకాశాలు” అనే అంశంపై నిర్వహించే సదస్సులో కీలకోపన్యాం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయరంగంలో ఏపీ ముందుకు వెళ్తున్న తీరును ఐరాస ప్రశంసించింది. 2024 కల్లా రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులను ఈ సాగువైపు మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తామని తెలిపింది. ఈ లేఖను ఐరాస ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సాల్హిమ్ పంపారు.













