బిర్లా కుటుంబానికి అమెరికాలో చేదు అనుభవం!
బారత్‌లోని అపర కుబేర కుటుంబాల్లో ఒకటైన బిర్లా కుటుంబానికి అమెరికాలోని ఓ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. కాలిఫోర్నియాలోని ఇటాలియన్-అమెరికన్ రెస్టారెంట్ స్కోపా ఇటాలియన్ రూట్స్ సిబ్బంది తమ పట్ల జాత్యహంకార వైఖరిని ప్రదర్శించారని కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా ఆరోపించారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె తన ట్విటర్లో పంచుకున్నారు. స్కోపా రెస్టారెంటు సిబ్బంది మా కుటుంబాన్ని తమ హోటల్ నుంచి గెంటేశారు. ఇది జాత్యహంకారమే. మీరు మీ కస్టమర్లను సరిగ్గా చూసుకోవడం నేర్చుకోండి. మీ రెస్టారెంట్లో తినేందుకు 3 గంటల పాటు వేచి చూశాం. ఓ వెయిటర్ మా అమ్మ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇది ఏమాత్రం సరికాదు అని ఆమె ట్వీట్ చేశారు. అనన్య బిర్లా తల్లి నీర్జా బిర్లా సైతం రెస్టారెంట్‌పై తన ట్విటర్లో దుమ్మెత్తిపోశారు.













