వెనకబడిన ప్రాతం లో బాలబాలికల పురోగతి కోసం
అమెరికాలో దాము & రాము గేదెల సోదరులు అనేక దశాబ్దాలగా సమాజ సేవకులుగా అందరికీ తెలిసిన వారే. న్యూ జెర్శీ నివాసులుగా అనేక స్థానిక, జాతీయ తెలుగు సంఘాలలో ఉన్నత పదవుల ద్వారానూ, దైవ భక్తులుగా దేవాలయాల నిర్మాణాలలోనూ అమెరికాలో తెలుగు సమాజానికే కాక యావత్ భారతీయ సమాజానికి వారు అందించిన క్రియాశీలకమైన సేవలు ఒక ఎత్తు అయితే వారి కుటుంబం నిస్వార్ధంగా తమ స్వగ్రామానికి అందిస్తున్న సేవలు మరింత విశిష్టమైనవి. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలంలో ఉన్న కత్తుల కవిటి గ్రామంలో వారి తల్లిదండ్రులైన సూర్యనారాయణమ్మ & సత్యనారాయణ నాయుడు గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన పాఠశాల అబివృద్ధికి వీరు వెన్నుదన్నుగా నిలిచి అందిస్తున్న సహాయం ఆదర్శప్రాయం. 1997 లో ఐదు ఎకరాల స్థలదానం, అవసరమైన మూలధనం తో ఆ పాఠశాలని ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దడం, అప్పటి ప్రభుత్వ సహకారంతో కత్తుల కవిటి గ్రామానికి తారు రోడ్డు నిర్మించి, తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న 15 పైగా గ్రామాల బాలబాలికలకి ఉన్నత విద్య అవకాశాలు కల్పించడం దాము & రాము గేదెల సేవలలో చెప్పుకోదగ్గవి. వీరి నుంచి స్ఫూర్తి పొందిన సారిపల్లి ఫౌండేషన్, శ్రీ నరహరి & భారతి కొండిశెట్టి, శ్రీ రవీంద్ర తోట మొదలైన వదాన్యులు ఆ పాఠశాలకి ఇతర సదుపాయాలు సమకూర్చారు.
ఈ నేపధ్యంలో కత్తుల కవిటి ఉన్నత పాఠశాల ప్రధాన ప్రారంభకులూ, నిరంతరం ఆ పాఠశాల అభివృద్దికి పాటుపడిన శ్రీ రాము గేదెల గారు గత జులై 18, 2021 న గుండె పోటుతో హఠాన్మరణానికి గురి అయ్యారు. అలాగే వారి దగ్గర బంధువు, సలహాదారు అయిన ప్రముఖ సినీ గాయకులు జి,ఆనంద్ గారు కోవిడ్ బారిన పడి మరణించారు. ఈ నేపధ్యంలో గత సెప్టెంబర్.2021 లో ప్రముఖ సినీ నటులు శ్రీ సుమన్ గారు ఈ కత్తుల కవిటి ఉన్నత పాఠశాలకి ఒక వెబ్ సైట్ ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా మొత్తానికే ఒక పాఠశాలకి తనదే అయిన వెబ్ సైట్ ప్రారంభం ఇదే తొలి సారి.
ఈ సందర్భంగా స్వర్గీయ రాము గేదెల పేరిట ఒక అత్యాధునిక కంప్యూటర్ లాబొరేటరీ వ్యవస్థాపనకి శ్రీకారం చుట్టినట్టు దాము గేదెల గారు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో వెనకబడిన ప్రాంతం అయిన పాలకొండ సమీపం లోని కత్తుల కవిటి గ్రామం, సమీపం లోని సుమారు 15 గ్రామాలకి చెందిన వందలాది బాలబాలికలకి ఈనాడు అత్యవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉచితంగా బోధించే ఈ సదుపాయానికి కావలసిన కంప్యూటర్లు, భవనం, ఇతర వనరులకి సుమారు $75,000 అవుతుంది అని అంచనా. అమెరికా నివాసులైన గేదెల కుటుంబం మాతృదేశానికి తమదైన సేవాదృక్పధంతో, నిస్వార్ధంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి మీకు తోచిన ఆర్ధిక సహాయం అర్ధించడమే ఈ ఉత్తరం సారాంశం.
Request for Tax-Deductible Financial Support
“Ramu Gedela Memorial Computer Laboratory Project”
Zilla Parishad High School, Kattula Kaviti, VeerGhattam Mandalam, Srikakulam District, Andhra Pradesh, India
(Specific reasons for funding request include purchasing of necessary computers, furniture & supplies, construction of the laboratory building, software training tools, staffing to teach, train and empower hundreds of high school students in 15 villages)
Suggested Donation Categories
(All donations in USA are tax-deductible, Tax ID: 76-044238)
All Donors will be prominently recognized on site on a granite plaque
సార్వభౌమ పోషకులు (Grand Benefactors): $5,000 -$10,000
చక్రవర్తి పోషకులు (Grand Sponsors): $2500-$5000
మహారాజ పోషకులు (Grand Patron): $1000-$2500
రాజ పోషకులు (Benefactors): $500-$1000
యువరాజ పోషకులు (Sponsors): $100-$500
Please contact Damu Gedela garu (+1 (856) 577-7112) for specific major sponsorships and special recognition such as “Computers Sponsored by”, Furniture Sponsored by”,
How to Donate in USA
(All donations in USA are tax-deductible. VFA is qualified to receive matching donations from most major corporations in USA such as Microsoft, Google, Chevron, Bank of America etc. We request you to please pursue this and double your kind donation).
You can send your generous tax-deductible donation by clicking or copy/paste the following link and follow the prompts to donate any amount using any credit card.
https://www.paypal.com/donate?hosted_button_id=MSV3XK94WDYRE
Alternately
You can send your donation directly to our bank account at Wells Fargo through Zelle using vangurifoundation@gmail.com or phone # 832 594 9054. Please make sure that you indicate “Ramu Gedela Memorial Project”, your phone number & mail ID in the memo section.
How to Donate in India
We welcome donations in Indian Rupees into our account from any bank in India
Account Name: Vanguri Chitten Raju
ICICI Bank, Sarpavaram Branch, Kakinada
Account Number: 247701075084
IFSC Code: ICIC0002477
For more details, please contact any of the following
Damu Gedela: +1 (856) 577-7112
Suman Gedela: +1 (856) 495-3949
Raju Vanguri: 1 832 594 9054













