అమెరికన్ లు సామాజిక దూరం పాటించటం లేదు
కరోనా వైరస్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు వైద్యులు సూచిస్తున్న సామాజిక దూరాన్ని అమెరికన్లందరూ పాటించటం లేదని కరోనా వైరస్‌కు సంబంధించిన వైట్‌హౌస్ అధికారి డా.దేవరా బ్రిక్స్ చెప్పారు. అమెరికన్లకు సామాజిక దూరం ప్రాధాన్యత తెలియటం లేదని, కేవలం మాస్క్‌లు ధరించినంత మాత్రాన కరోనా వ్యాప్తి తగ్గదని ఆయన మీడియా సమావేశంలో సృష్టం చేశారు. కొద్ది సంఖ్యలోనైనా ప్రజలు గుమిగూడటాన్ని కట్టడి చేయాల్సిన అవసరం వుందన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు వ్యవహార శైలిని మార్చుకుని దాని ప్రభావాన్ని అడ్డుకోవాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.













