అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
జీవ పరిణామక్రమ సూత్రాల ఆధారంగా సరికొత్త ఎంజైమ్లను అభివృద్ధి చేసిన అమెరికా పరిశోధకురాలు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, పరిశోధకుడు జార్జ్ పీ స్మిత్, బ్రిటన్ శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్లను రసాయన శాస్త్రంలో నోబెల్ వరించింది. ఈ ఎంజైమ్లతో జీవ ఇంధనాలు మొదలుకొని ఔషధాల వరకూ అన్నింటినీ తయారు చేసేందుకు వీలుపడుతోంది. 2018 రసాయన నోబెల్ విజేతలు డార్విన్ పరిణామక్రమ సూత్రాలపై పట్టు సాధించారు. మానవాళికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చేందుకు దీన్ని వారు ఉపయోగించారు అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ముగ్గురు పరిశోధకులూ పరిణామక్రమానికి సంబంధించి ఒకే సుత్రాల (జన్వు మార్పులు, జన్వువుల ఎంపిక) సాయంతో భిన్న రంగల్లో ఉపయోగపడే ప్రొటీన్లను అభివృద్ధి చేశారు.













