భక్తి చాయ్ తో కోట్ల సంపాదన
అమెరికాకు చెందిన బ్రూక్ ఎడ్డీకి చాయ్ అంటే ప్రాణం. 2002లో ఆమె భారత్కు వచ్చింది. మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించింది. ఆ నేపథ్యంలో ఇక్కడి చాయ్ రుచికి ఫిదా అయింది. తర్వాత కొలరాడోకి తిరిగి వెళ్లినప్పటికీ ఇండియన్ చాయ్ ఆమెను వెంటాడింది. స్థానికంగా అలాంటి టీ రుచి ఆమెకు దొరకలేదు. దీంతో 2007లో తానే స్వయంగా భక్తి చాయ్ పేరుతో చాయ్ బిజినెస్ మొదలు పెట్టింది. ఇండియాలో టీ ఎలా తయారు చేస్తారో అదే విధంగా తనకు గుర్తున్నంత మేరకు, చిక్కని చాయ్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టింది. అంతే ఏడాది గడిచేసరికి బ్రూక్ ఎడ్డీ తయారు చేసిన భక్తి చాయ్ అమెరికన్లను ఆకట్టుకుంది. రెండేళ్లకు ఆమెను మిలియనీర్ను చేసింది. 2014లో ఓ అమెరికన్ వీక్లీ మ్యాగజైన్ నిర్వహించిన ఆంత్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ పోటీలో ఐదుగురు ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2018లో తన చాయ్ బిజినెస్ ఆదాయం ఏడు మిలియన్ డాలర్లకు చేరుతుందని ఎడ్డీ ధీమాతో ఉంది.













