ATA Day: అదరహో అట్లాంటాలో ఆటా డే – మాతృత్వం & మహిళల గౌరవానికి అంకితం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అట్లాంటా శాఖ ఆధ్వర్యంలో, మే 18 వ తారీఖున ఆటా డే (ATA Day) వేడుక అల్ఫరేటాలోని డెసానా మిడిల్ స్కూల్ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. సుమారు 2000 మంది శ్రోతలు హాజరై మాతృత్వానికి, మహిళా శక్తికి అత్యున్నత గౌరవం ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ గారు మాతృమూర్తుల విలువ, మహిళ సాధికారత పైన ప్రధాన ప్రసంగం చేశారు. ఆటా చేపట్టిన కార్యాచరణను ఆయన ప్రశంసించారు.
సాంస్కృతిక వైభవానికి పెద్ద పీఠ వేస్తూ నిర్వహించిన అద్భుత నృత్యాలు, హృద్యమైన గాన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. శ్రావణి రాచకుల్లా, స్పందన అల్తాటి ఆధ్వర్యంలో మదర్ & చైల్డ్ థీమ్‌తో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అట్లాంటా స్థానిక కళాకారుల నిర్వహించిన లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రేక్షకులను అలరించింది.
సామాజిక సేవలందించిన 11 మంది వ్యక్తులకు ఆటా తరఫున గౌరవ పురస్కారాలు అందజేశారు. అట్లాంటా ప్రముఖులు రత్నాకర్ ఎలుగంటి, బాలా ఇండుర్తి, ప్రదీప్ ముడుపు, అంజయ్య చౌదరి లావు, రంగారావు సుంకర, హనుమాన్ నందనంపాటి, డా. శోభా చోక్కలింగం, అపర్ణా భట్టాచార్య, ఆర్య ఉపాధ్యాయ, కమక్షి ధనరాజ్, డా. సుజాత రెడ్డి అవార్డులను అందుకున్నారు. అవార్డులను కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్, ఆటా అధ్యక్షుడు జయంత్ ఛల్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ గుడిపాటి తదితరులు ప్రధానం చేసారు. సమాజ సేవలో చేసిన విశేష కృషికి ఆటా పూర్వ అధ్యక్షులు డా. కరుణాకర్ అసిరెడ్డి గారికిను గౌరవ పురస్కారం అందజేశారు.
ప్రాంతీయ కోఆర్డినేటర్లు కిరణ్ తడకమల్లా, అనిల్ కుశ్నపల్లి, చంద్రశేఖర్ అల్తాటి. వుమెన్స్ కోఆర్డినేటర్స్ స్వాతి రెడ్డి, సేవ కోఆర్డినేటర్ అనిల్ చిమిలి, ప్రాంతీయ డైరెక్టర్:సందీప్ రెడ్డి, ప్రాంతీయ వుమెన్స్ చైర్:శృతి చిత్తోరి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు:అనిల్ బొద్దిరెడ్డి, శ్రీరామ్ శ్రీనివాస్, శ్రీధర్ తిరుపతి, కిరణ్ రెడ్డి పాశం సలహాదారులు: కరుణ అసిరెడ్డి, నరేందర్ చెమర్ల, వెంకట్ వీరనేని. ప్రాంతీయ సలహాదారులు, స్టాండింగ్ కమిటీ చైర్స్, కో-చైర్స్ & సభ్యులు అందరి కృషితో ఈ వేడుక విజయవంతమైంది.
ఈ వేడుకలో బిర్యానీ వరల్డ్ గౌతమ్ గోలి & టీం , స్పాన్సర్ చేసిన భోజన విందు ఆహుతులను అలరింపచేసింది. ప్రధాన స్పాన్సర్ సువిధ ఇంటర్నేషనల్ గ్రోసరీస్ మరియు దేశి డిస్ట్రిక్ట్ మార్కెట్ & ఈటెరీ, టాప్ సైస్ ఐటీ మొదలగు వారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి బైట్ గ్రాఫ్ ప్రొడక్షన్స్ సాంకేతిక మద్దతు మరియు ప్రసారాన్ని విజయవంతంగా అందించింది.ఈ కార్యక్రమానికి వివిధ నగరాల నుండి నాయకులు హాజరయ్యారు – జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, శ్రీకాంత్ గుడిపాటి, కెకే రెడ్డి, రామకృష్ణ మరియు కిషోర్ గూడూరు.
ఆటా సేవా నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిన ఈ వేడుక, మాతృత్వం మరియు మహిళా గౌరవానికి అంకితంగా నిర్వహించబడింది. ఆటా డే 2025, అట్లాంటా తెలుగు సంఘ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.







