అమెరికన్ సింగర్ కి కరోనా…
ప్రముఖ అమెరికన్ కంట్రీ సింగర్ కేలీ షోర్ (25)కి కరోనా సోకింది. మూడు వారాలుగా ఇంట్లోనే ఉన్నప్పటికీ, తనకి కరోనా సోకిందని చెబుతుంది. నిత్యావసర సరుకుల కోసం మాత్రమే బయటకి వెళ్లానని అంటున్న ఆమె ఎక్కడో అజాగ్రత్త వలన కరోనా కాటుకి బలైంది. కొద్ది రోజులుగా గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటున్న కేలీ షోర్కి ఒళ్లు నొప్పులు, జ్వరం, రుచించకపోవడం, ముక్కు పనిచేయడం మానేశాయి. దీనిని బట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఈ విషయాన్ని సీరియన్‌గా తీసుకోకపోవడం నాకు విసుగు తెప్పిస్తోంది అని కేలీ ట్వీట్ చేశారు. 13వ ఏటనే గిటార్ నేర్చుకున్న ఈమె యూ ట్యూబ్‌లో అనేక హిట్ సాంగ్స్‌కి కవర్ సాంగ్స్ రూపొందించారు. అమెరికా జానపద, పాశ్చాత్య సంస్కృతుల మేళవింపుతో కూడిన పాటలు ఆలపించే కేలీ ఆరేళ్ల నుండే గీత రచన కూడా చేస్తున్నారు. ఫైట్ లైక్ ఏ గర్ల్ పాటతో ఈమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.













