అట్లాంటాలో సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో ఆప్త 15వసంతాల పండుగ
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) 15వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. అట్లాంటాలోని గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకోసం వివిధ కమిటీలను కూడా నియమించారు. ఈ కన్వెన్షన్‌కు విజయ్ గుడిసేవ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. కో కన్వీనర్లుగా వెంకట్ మీసాల, చిట్టి ముత్యాల, అశోక్ గాల్ల, చిన్ని నాయుడు, లక్ష్మీ వెలివెల ఉన్నారు. సెక్రటరీగా శౌరీ ప్రసాద్ కొచ్చెర్ల, ట్రెజరర్‌గా సురేష్ ధూళిపూడి వ్యవహరిస్తున్నారు.
ఆప్త బోర్డ్ చైర్ గా డా. సుబ్బు కోట, సెక్రటరీ తేజోవట్టి, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ భాస్కర్ కొట్టె, సెక్రటరీ రవి ఎలిసెట్టి, ట్రెజరర్ సత్య బల్ల, వైస్ ప్రెసిడెంట్లు సమీర చవకుల, రాజీ జక్కుల అద్దెపల్లి, సత్య తోట, జాయింట్ సెక్రటరీ శ్రీరామ్ మతి, రాజ్ పప్పుల, సంతోష్ యాతం, జాయింట్ ట్రెజరర్ జ్యోతి గాజుల, శ్రీనివాస్ అర్కోట, రాజేష్ అర్జ ఉన్నారు.
కన్వెన్షన్ కోసం నియమించిన కమిటీ చైర్ ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అవార్డు కమిటీ చైర్‌గా సురేష్ కాట్రోతు, బాంక్వెట్ కమిటీ చైర్‌గా వేణుగోపాల్ తోట, కన్వెన్షన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కమిటీ చైర్‌గా సుబ్బు చెన్నం, కల్చరల్ కమిటీ చైర్‌గా ప్రియాంక గడ్డం, డెకరేషన్స్ కమిటీ చైర్‌గా పావనీ గూడె, డొమెస్టిక్ గెస్ట్స్ రిలేషన్స్ కమిటీ చైర్‌గా వెంకట్ పొలాకం, ఎగ్జిక్యూటివ్ లాంజ్ కమిటీ చైర్‌గా ఉదయ్ ఆకుల, ఎగ్జిబిట్స్ కమిటీ చైర్‌గా లతీష్ శ్రీపాటి, ఫుడ్ కమిటీ చైర్‌గా రవి కల్లి, ఫండ్ ఎన్హాస్మెంట్ కమిటీ చైర్‌గా అనిల్ కుమార్ వెరిసెట్టి, ఫండ్ రైజింగ్ కమిటీ చైర్‌గా రవి ముళ్ళపూడి, హాస్పిటాలిటీ కమిటీ చైర్‌గా ఇన్నయ్య ఎనుముల, హోటల్స్ కమిటీ చైర్‌గా సప్తగిరీష్ ఇందుగాల, ఇంటర్నేషనల్ కల్చరల్ కో ఆర్డినేటర్ కమిటీ చైర్‌గా జనార్ధన్ పన్నెల, ఇంటర్నేషనల్ గెస్ట్స్ రిలేషన్స్ కమిటీ చైర్‌గా రమేష్ బాస, మెట్రిమోనియల్ కమిటీ చైర్‌గా విశ్వేశ్వరరావు మాధవరపు, మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్‌గా కృష్ణ మేకల, మనీ మ్యాటర్స్, వాల్ స్ట్రీట్ కమిటీ చైర్‌గా వేణు మమ్మాయి, మూవీ ఆర్టిస్ట్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా సురేష్ లింగినేని, నెక్ట్స్ జెన్ కమిటీ చైర్‌గా లక్ష్మీ అనుమకొండ, పొలిటికల్ కమిటీ చైర్‌గా చంద్రశేఖర్ పొలిసెట్టి, రిజిస్ట్రేషన్ కమిటీ చైర్‌గా విజయ్ కొచ్చెర్ల, సెక్యూరిటీ కమిటీ చైర్‌గా లీలా కిషన్ వడ్లమూడి, స్ప్రిట్యువల్ కమిటీ చైర్‌గా శివతాడి, స్పోర్ట్స్ కమిటీ చైర్‌గా రాజేశ్ కటికి, స్టేజ్ కమిటీ చైర్‌గా సురేష్ కారోతు, టెక్నాలజీ కమిటీ చైర్‌గా సద్గురు మనుకొండ, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ చైర్‌గా రాజేష్ యల్లబండి, వెన్యూ కమిటీ చైర్‌గా సురేష్ కారోతు, వలంటీర్స్ కమిటీ చైర్‌గా కృష్ణ ఇక్కుర్తి, వెబ్ సైట్ కమిటీ చైర్‌గా నాగ ఎర్రంసెట్టి, ఉమెన్స్ ఫోరం కమిటీ చైర్‌గా రాణి వడ్లమూడి ఉన్నారు.
ఈ కన్వెన్షన్ కోసం పలువురు అతిధులను నిర్వాహకులు ఆహ్వానించారు. రాజకీయరంగం నుంచి పలువురిని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, డా. వినయ్‌కుమార్ పుంజాల, ప్రెసిడెంట్, టిఎస్సి, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, వడ్డిరాజు రవిచంద్ర, ఎపి మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మాజీమంత్రుల మండలి బుద్ధప్రసాద్, నిమ్మకాలయ చినరాజప్ప, పొన్నాల లక్ష్మయ్య, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, వీరితోపాటు బొలిసెట్టి సత్యనారాయణ, డా. పసుపులేటి హరిప్రసాద్, బొలిసెట్టి శ్రీనివాసరావు, సందీప్ పంచకర్ల తదితరులను ఆహ్వానించారు.
సినిమారంగం నుంచి అల్లు శిరీష్, విశ్వక్ సేన్, సత్యదేవ్, వైష్ణవ్ తేజ్, సందీప్ కృష్ణన్, హర్ష చెముడు, ప్రవీణ్, సత్య అక్కల హీరోయిన్లు అవికా గోర్, అను ఇమ్మాన్యుయేల్, మాధవిలత, స్పందన పల్లి, నివేదిత, నేహాశెట్టి, అంజలి, నిధి అగర్వాల్, నాగ దుర్గ నాయుడు, రాధిక శరత్‌కుమార్, దర్శకుడు బాబి కొల్లి, సంగీత దర్శకులు మణి శర్మ, కోటి, రఘు కుంచె, గాయని మాళవిక ఆనంద్, ఇమిటేషన్ రాజు గగోలు, యాంకర్ డా. సయ్యద్ మఖ్దూం తదితరులను ఆహ్వానించారు.
సాహిత్యరంగం నుంచి చంద్రబోస్, అనంత్ శ్రీరాం, రవికుమార్ నరాలసెట్టి, గుమ్మడి గోపాల కృష్ణను ఆహ్వానించారు.
ఎంట్రప్రెన్యూర్ రంగం నుంచి కెవికె రావు, రంగిసెట్టి మంగబాబు, ఆధ్యాత్మిక రంగం నుంచి బౌద్ధ సన్యాసి తోరం శివ గంగాధరమ్ అలియాస్ బోధిహీన్ వస్తున్నారు.













