అమెరికాలో ఆప్త పదో వార్షికోత్సవ సభలు
ఆప్త (అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) పదో వార్షికోత్సవ సభలు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రతినిధి రాధిక నైగాపుల తెలిపారు. వాషింగ్టన్ డీసీ మేరిల్యాండ్ బాల్దిమోర్లో జరిగే జాతీయ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ పారిశ్రామిక రంగాల ప్రముఖులను ఆహ్వానించినట్లు వివరించారు. ఆప్త ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతిభ చూపిన వెయ్యి మంది విద్యార్థులకు రూ.1.50 కోట్ల ఉపకార వేతనాలు, పాఠశాల బ్యాగ్స్ అందిస్తున్నామన్నారు. మూడు రోజుల పాటు జరిగే సభల్లో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్లు ఆప్త అధ్యక్షుడు గోపాల గూడపాటి పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు మధు ఉల్లి, కన్వీనర్ ధీరజ్ ఆకుల, కో కన్వీనర్లు శ్రీనివాస్ చందు, నటరాజ్ ఇల్లూరి, రెడయ్య పత్తిపాటి, శ్రీనివాస్ సిద్ధినేని, లలితా బైరా, వ్వవస్థాపకులు ప్రసాద్ సమ్మెట, శ్రీనివాస్ చిమెట తదితరులు వార్షికోత్సవ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు.













