అమెరికా జాతీయురాలిని విడుదల చేసిన దుండగులు
ఉగాండలో కిడ్నాప్‌కు గురైన అమెరికా జాతీయురాలు, ఆమె డ్రైవర్‌ను దుండగులు విడుదల చేశారు. ఈ విషయాన్ని ఉగాండ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. అయితే, అమెరికా జాతీయురాలి కుటుంబ సభ్యులు వీరి విడుదల కోసం కిడ్నాపర్లకు 500,000 డాలర్లు (రూ.3,47,92,500)చెల్లించినట్టు సమాచారం. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఉగాండలోని క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్‌లో కింబర్లీ ఎండికాట్ అనే అమెరికా జాతీయురాలిని, ఆమె డ్రైవర్ జీన్ పాల్ మిరేంజ్ను కొందరు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం వీరి విడుదల కోసం 500,00 డాలర్లు డిమాండ్ చేశౄరు. దుండగులు డిమాండ్ చేసిన మొత్తాన్ని కింబర్లీ కుటుంబ సభ్యులు చెల్లించడంతో విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కింబర్లీ, జీన్ పాల్ విడుదలను ధ్రువీకరించారు.













