అనాథ బాలుడిని దత్తత తీసుకున్న అమెరికా దంపతులు
అమెరికాలో స్థిరపడిన ఆ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అయినా భారతదేశంలో వారి పెద్దల మూలాలు ఉండడంతో, ఈ దేశంపై గౌరవంతో ఇక్కడి బాలుడిని దత్తత తీసుకోవాలనుకున్నారు. దీంతో ఓ నాలుగేళ్ల అనాథబాలుడికి బంగారు భవిష్యత్తు లభించింది. అమెరికా దంపతులు తెరిఅన్న ప్లాట్అండ్, మాధ్యువెడ్వర్డ్ ప్లాట్లాండ్ అడాప్ట్ రీసోర్స్ ఏజెన్సీ కింద దత్తతకు దరఖాస్తు చేసి, మైలవరం మండలం డాడీ హోంలోని అనాథ బాలుడిని దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో స్త్రీ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ దత్తత ఇచ్చారు. తమ ఇద్దరు కూతుళ్లకు అండగా తమ్ముడు వచ్చాడంటూ అమెరికా దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బిడ్డ కోసం చక్కటి బెడ్రూం, ఆట వస్తువులు సిద్ధం చేశామని, తమ బిడ్డలు తమ్ముడి కోసం ఎదురుచూస్తున్నారని వారు పేర్కొన్నారు దత్తత తీసుకున్న తెరి అన్నాప్లాట్లాండ్ తండ్రి డాక్టర్ శ్రీధర్ పంకనీకర్ దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు.













