అమెరికాలో ప్రవాస భారతీయుల ఆందోళన
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఆందోళనలు విదేశాలకూ పాకాయి. అమెరికాలోని 30 రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఈక్వాలిటీ ల్యాబ్స్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ తదితర సంస్థలు ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహించాయి. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో, హ్యుస్టన్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో నివసిస్తున్న వందల మంది ప్రవాసా భారతీయులు 71వ గణతంత్ర దిన వేడుకలను తమ నిరసనకు వేదికగా చసుకున్నారు. బ్యాన్లరు, ప్లకార్డులు పట్టుకొని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన ప్రదర్శనలో రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత సందీప్ పాండే పాల్గొన్నారరు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలే కాపాడుకుంటారనే నమ్మకం ఈ ఉద్యమంతో తనకు కలిగిందని చెప్పారు.













