కళాతపస్వి కే. విశ్వనాథ్ గారికి ఆటా శ్రద్ధాంజలి
చలనచిత్ర సాగర సంఘమ గర్భంలో దొరికిన స్వాతి ముత్యం…
సాంఘిక సమస్యలను తన చిత్రాల ద్వారా ప్రస్తావిస్తూ సమాజ మార్పుకు యత్నించిన శుభ సంకల్పి…
భారతీయ సినీ పరిశ్రమపై ప్రసరించిన స్వాతి కిరణం …
సినీ కళామ తల్లి మెడలో(శంకరా) ఆభరణం…
తెలుగు చిత్ర రంగం పై కురిసిన సిరి వెన్నెల…
భారతీయ కళలను బ్రతికించుటకు నిరంతరం తపస్సు చేసిన కళాతపస్వి…
మన కాశీనాధుని విశ్వనాథుడు లేరని చెప్పడానికి హృదయం ద్రవిస్తుంది. ఆ మహా దర్శకుని ఆత్మకు శాంతి చేకురాలని సమస్త దేవుళ్ళను ప్రార్ధిస్తూ…
అమెరికా తెలుగు సంఘం శ్రద్ధాంజలి ఘటిస్తుంది.













