18 ఆటా మహాసభల సందర్భంగా ..అమెరికా తెలుగు సంఘం నవలల పోటీ
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 18వ మహాసభల సందర్భంగా నవలల పోటీ నిర్వహిస్తున్నారు. 2024 జూన్ 7, 8, 9 తేదీల్లో ఆటా మహాసభలు జరగనున్నాయి. ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, రవి వీరెల్లి, కిరణ్ పాశం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నవలలు తమ స్వంతమనీ, అనువాదాలు, అనుసరణలు కాదనీ, గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని, వేరే పత్రికల వద్ద పరిశీలనలో లేదనీ, ఫలితాలు వచ్చే వరకు ఎక్కడా ప్రచురింపబోమని పేర్కొంటూ రచయితలు హామీ పత్రం జతచేయాలి. నవలల ఎంపికలో తుది నిర్ణయం ఆటా నిర్వాహకులదే. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, వాద ప్రతివాదాలకు తావులేదు. నవలల పోటీ గడువు తేదీ పొడిగించే విషయంలో గానీ, పోటీ రద్దు విషయంలో గానీ, బహుమతి మొత్తం మార్పులు చేసే విషయంలో గానీ నిర్వాహకులకు సర్వహక్కులు ఉన్నాయి.
ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా నవలకు నేపథ్యం కావొచ్చు కానీ అది తెలుగు వారి జీవితానికి సంబంధించినదై ఉండాలి. నవల అచ్చులో కనీసం 150 పేజీలయినా ఉండాలి. ప్రపంచంలోని ఎక్కడి వారయినా ఈ పోటీకి నవవలు పంపవచ్చు. తెలుగులో డిటిపి చేసిన కాపీలను లేదా చేతిరాతను స్కాన్ చేసిన కాపీలను ఈమెయిల్ ద్వారా atanovels2024@gmail.com కు పంపాలి. నవలల అందవలసిన ఆఖరి తేదీ జనవరి 14, 2024 లోపు పంపాలి. ఇతర వివరాలకు atanovels2024@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. ఈ నవలల పోటీ విజేతలకు రూ.2 లక్షల విలువైన బహుమతులు అందించనున్నామని ఆటా ప్రతినిధులు తెలిపారు.













