ఇన్వెస్టర్ వీసాతో రెండేళ్లలో అమెరికా గ్రీన్‌కార్డు
అమెరికాలో ఇన్వెస్టర్స్ వీసాతో రెండేళ్లలోనే గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉందని క్రాస్ బోర్డర్స్ డైరెక్టర్, సీఈఓ భాస్కర్ దూలం తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలో ఇప్పటివరకు హెచ్1బి, ఎఫ్1, ఎల్1 వీసాలపై గ్రీన్ కార్డు దరఖాస్తు చేసుకుంటే కనీసం 10 నుంచి 12 సంవత్సరాలు పడుతోందన్నారు. అదే ఈబీ5 ఇన్వెష్టర్స్ వీసాతో రూ.5 లక్షల యూఎస్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి పది మంది యూఎస్ పౌరులకు ఉపాధి చూపిస్తే రెండేళ్ల వ్యవధిలో గ్రీన్ కార్డు పొందవచ్చునని చెప్పారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ అమెరికాలో ఇటీవల రూపొందించిన నియమ నిబంధనలు ప్రకారం వీసా, గ్రీన్ కార్డు పొందడం క్లిష్టతరమైందన్నారు. ఇన్వెస్టర్స్ వీసా ఇందుకు చక్కని ప్రత్యామ్నాయమన్నారు. ఈబీ5 విధానం ద్వారా కేవలం రెండు సంవత్సరాల్లోనే గ్రీన్ కార్డు పొందవచ్చునన్నారు. దీనికి గాను భారతదేశంలో ఇన్వస్టర్స్ రీజనల్ సెంటర్లు ఉన్నాయని వీటి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9666123401 సంప్రదించాలని మన్నవ మోహన్ కృష్ణ సూచించారు.













