ఆన్లైన్ వేదికల దుర్వినియోగంపై ఆందోళన
టెక్నాలజీ ప్రాబల్యంతో ఆన్లైన్ వేదికల ద్వారా విద్వేషం, హింస పెరిగిపోతుననదనే ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ సెనేట్‌లో బుధవారం జరిగే విచారణ సందర్బంగా టెక్ దిగ్గజాలు విచారణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. సాంకేతిక దిగ్గజాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో వారు నిర్మించిన దిగ్గజ సంస్థలు అమెరికన్ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వారు సమర్థించుకోనున్నారు. ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ దాని మాతసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు విచారణకు హాజరు కానున్నారు.













