NATS: నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు ‘‘అమెరికా తెలుగు సంబరాలు’’ పేరుతో జూలై 4,5,6 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా తెలుగు పరిమళాలను వెదజల్లుతూ.. ఆధ్యాత్మిక, సాహితీ, కళ, సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ సభలు ఉత్సాహంగా సాగనున్నాయని నాట్స్ 2025 సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటి, అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు తెలిపారు.
హిల్స్‌బరో నది ఒడ్డున డౌన్‌టౌన్ అందాల నడుమ ఉన్న టాంపా కన్వెన్షన్ సెంటరు ఈ సంబరాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సంబరాల్లో తెలుగుదనానికి పెద్దపీట వేస్తూ అందుకు తగ్గట్టుగా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సంబరాలను విజయవంతం చేయడంకోసం నాట్స్ సంబరాల కమిటీని ఏర్పాటు చేసింది. సంబరాల కమిటీ కార్యదర్శిగా శ్రీనివాస్ మల్లాదికి బాధ్యతలు అప్పగించారు. సంబరాల సంయుక్త కార్యదర్శిగా విజయ్ చిన్నం వ్యవహారించారు. సంబరాల కోశాధికారిగా సుధీర్ మిక్కిలినేని, సంబరాల సంయుక్త కోశాధికారిగా రవి కానురిలకు బాధ్యతలు అప్పగించింది. ప్రసాద్ ఆరికట్ల ` రెవిన్యూ జనరేషన్ డైరెక్టర్, భరత్ ముల్పూరు ` రెవిన్యూ జనరేషన్ కో డైరెక్టర్ గా ఉన్నారు. ఇలా మిగతా సభ్యులు కూడా తమకు అప్పగించిన బాధ్యతలతో నాట్స్ సంబరాల విజయవంతానికి కృషి చేస్తున్నారు. ఈ సంబరాలకు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా నాట్స్ తగ్గించింది.
ఈ మహాసభల్లో భాగంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించేందుకు నాట్స్ సంబరాల నాయకులు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుసుకుని ఆహ్వానపత్రాలను అందజేశారు. అలాగే ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎంపీలను కలుసుకుని నాట్స్ సంబరాలకు ఆహ్వానించారు. అలాగే ఢల్లీిలో ఉన్న కేంద్రమంత్రులను కూడా ఈ వేడుకలకు రావాలని కోరారు.
అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమలను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది.
అలాగే కాణిపాకం విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంబరాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు కాణిపాకం విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం పొందేందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టంపాలో కూడా విఘ్నేశర్వ సహస్ర మోదక హోమం నిర్వహించారు. ఈ సంబరాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా విజయవంతం కావాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వర హోమాన్ని నాట్స్ నిర్వహించింది. నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరిగింది.
నాట్స్ సంబరాలను పురస్కరించుకుని అమెరికావ్యాప్తంగా కథలు, కవితలు, పద్యాల పోటీలను నిర్వహించారు. వీటితో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీలను
సైతం నిర్వహించి విజేతలకు నాట్స్ సంబరాల ప్రధాన వేదికపై బహుమతులను అందజేయనున్నారు.
ఈ సంబరాలకు అగ్రహీరోలు వస్తుండటంతో ఈ సంబరాలపై అందరి దృష్టి ఉంది. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, అల్లు అర్జున్ హీరోయిన్‌లు శ్రీలీల, ఫరియా అబ్దుల్లా, నాటి హీరోయిన్‌లు మీనా, ఆమని, జయసుధ తదితరులు వస్తున్నారు. సినీ దర్శకులు కే. రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, మెహర్ రమేష్ తదితరులు కూడా ఈ సంబరాలకు వస్తున్నారు. ఇంతమంది భారీ తారాగణం తెలుగు మహాసభలకు రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.
ఈ మహాసభలకు పలువురు రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు. కేంద్రమంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, డా. చంద్రశేఖర్ పెమ్మసాని, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎపి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎపి హోంశాఖ మంత్రి అనిత వంగలపూడి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అంగాని సత్యప్రసాద్, కింజరపు అచ్చన్నాయుడు, శ్రీభరత్‌మెతుకుమిల్లి, కొండపల్లి శ్రీనివాస్, కొలుసుపార్థసారథి, ఎంపిలు సిఎం రమేశ్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే సురేష్ కాకర్ల, వెనిగండ్ల రాము, పులివర్తి వెంకటమణి ప్రసాద్ (నాని), కూన రవికుమార్, ధూళిపాల్ల నరేంద్రకుమార్, డా. కామినేని శ్రీనివాస్, తంగిరాల సౌమ్య, గౌతుశిరీష, పాతూరి నాగభూషణం, టీటీడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, ఎ.వి. గురవారెడ్డి తదితరులు వస్తున్నారు.
సాహిత్యరంగం నుంచి తనికెళ్ళ భరణి, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, త్రిపురనేని కళ్యాణ చక్రవర్తి, నిట్టల కిరణ్మయి, నేమాని లక్ష్మీ నరసింహ సోమయాజులు వస్తున్నారు. ఆధ్యాత్మిక రంగం నుంచి భక్తి సంగీతంలో పేరు పొందిన పారుపల్లి శ్రీరంగనాథ్, కొండవీటి జ్యోతిర్మయి వస్తున్నారు.
యాంకర్ సుమ రాక
తమ యాంకరింగ్‌తో పాపులర్ అయిన పలువురు ఈ సంబరాలకు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యాంకరింగ్‌లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సుమ ఈ సంబరాలకు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో పలు తెలుగు సంఘాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేసిన సుమ ఈ సంబరాలను కూడా తనద్కెన శ్కెలి వ్యాఖ్యానంతో రక్తికట్టించనున్నారు. ఆమెతోపాటు ఇతర యాంకర్లు రవి, అషురెడ్డి, శ్రీముఖి తదితరులు పాల్గొంటున్నారు.
సంబరాలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. డోనర్లకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో తెలుగుదనం కనిపించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. క్లాసికల్ నృత్యాలతోపాటు జానపద నృత్యాలను కూడా ఏర్పాటు చేశారు.
సంబరాల్లో టీవీ తారలు
ఈ కార్యక్రమాల్లో పలువురు సినీ తారలు, సంగీత దర్శకులు, నిర్మాతలు, దర్శకులు, నేపథ్య సినీ గాయనీగాయకులు ఇతరులు వస్తున్నారు. టీవీ తారలు కూడా ఈ సంబరాల్లో సందడి చేయను న్నారు. అషురెడ్డి, తేజస్విని గౌడ, దీపిక రంగరాజు, అరియాణా గ్లోరి, ప్రియాంక జ్కెన్, భానుశ్రీ తదితరులు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. వీరంతా ఓ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నట్లు నాట్స్ నాయకులు తెలిపారు.







